చిత్రపు నారాయణమూర్తి (1913-1985) తొలితరం చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. ఇతడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు. ఇతడు తన మొదట తన సోదరుడు చిత్రపు నరసింహమూర్తికి సహాయకుడిగా సీతాకళ్యాణం, సతీతులసి, మోహినీరుక్మాంగద, కృష్ణ జరాసంధ మొదలైన సినిమాలకుపనిచేశాడు. దర్శకుడిగా ఇతని తొలిచిత్రం భక్త మార్కండేయ. ఈ చిత్రం ఇతడిని మంచి దర్శకుడిగా నిలబెట్టింది. తరువాత ఇతడు తెలుగు, తమిళ,కన్నడ భాషలలో అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు 1961లో కృష్ణకుచేల అనే సినిమాను నిర్మించాడు. అది అతనికి ఆర్థికంగా నష్టాలను తెచ్చిపెట్టింది.
విడుదలైన సంవత్సరం | సినిమా పేరు | భాష | నటీనటులు |
---|---|---|---|
1938 | భక్త మార్కండేయ | తెలుగు | వేమూరి గగ్గయ్య, శ్రీరంజని (సీనియర్) |
1940 | మైరావణ | తెలుగు | వేమూరి గగ్గయ్య,చిత్తజల్లు కాంచనమాల |
1941 | దక్షయజ్ఞం | తెలుగు | వేమూరి గగ్గయ్య, సి.కృష్ణవేణి, త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి, సదాశివరావు, బెజవాడ రాజారత్నం, టీ.జి. కమలాదేవి, జి.వరలక్ష్మి |
1942 | భక్త ప్రహ్లాద | తెలుగు | వేమూరి గగ్గయ్య, జి.వరలక్ష్మి |
1943 | భక్త కబీర్ | తెలుగు | |
1944 | భీష్మ | తెలుగు | జంధ్యాల గౌరీనాథశాస్త్రి, కృష్ణవేణి, లక్ష్మీరాజ్యం, సి.ఎస్.ఆర్, పారుపల్లి సుబ్బారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, పారుపల్లి సత్యనారాయణ |
1944 | సంసార నారది | తెలుగు | మద్దాలి కృష్ణమూర్తి |
1947 | బ్రహ్మరథం | తెలుగు | బి.జయమ్మ, సి.కృష్ణవేణి, అద్దంకి శ్రీరామమూర్తి,పారుపల్లి సుబ్బారావు, ఏ.వి.సుబ్బారావు, కళ్యాణం రఘురామయ్య |
1948 | మదాలస | తెలుగు | సి.కృష్ణవేణి, అంజలీ దేవి, శ్రీరంజని, కళ్యాణం రఘురామయ్య, ఏ.వి.సుబ్బారావు |
1949 | బ్రహ్మరథం | తెలుగు | |
1952 | ఎన్ తంగై | తమిళం | ఎం.జి.రామచంద్రన్, ఇ.వి.సరోజ |
1953 | నా చెల్లెలు | తెలుగు | జి.వరలక్ష్మి, సూర్యకళ, రామశర్మ, అమరనాథ్ |
1954 | ఎదిర్ పరాధదు | తమిళం | శివాజీ గణేశన్, ఎస్.వరలక్ష్మి,పద్మిని, చిత్తూరు నాగయ్య |
1955 | ఆదర్శ సతి | కన్నడ | ఆర్.నాగేంద్రరావు, జమున, షావుకారు జానకి |
1956 | నాగులచవితి | తెలుగు | ఆర్.నాగేంద్రరావు, షావుకారు జానకి |
1957 | పతిని దైవమ్ | తమిళం | జి.వరలక్ష్మి, కె.ఎ.తంగవేలు |
1958 | అణ్ణయిన్ ఆణై | తమిళం | శివాజీ గణేశన్, సావిత్రి, పండరీబాయి, ఎస్.వి.రంగారావు |
1958 | మనమలై | తమిళం | కె.బాలాజి, సావిత్రి, కె.ఎ.తంగవేలు |
1958 | నాన్ వాలార్త తంగై | తమిళం | ప్రేమ్ నజీర్, మైనావతి, పండరీబాయి |
1959 | దైవమే తునై | తమిళం | అక్కినేని నాగేశ్వరరావు,పద్మిని, కె.ఎ.తంగవేలు |
1960 | భక్తశబరి | తెలుగు | శోభన్ బాబు, చిత్తూరు నాగయ్య, పండరీబాయి |
1960 | భక్తశబరి | కన్నడ | నగేష్, పండరీబాయి |
1960 | భక్తశబరి | తమిళం | |
1961 | కృష్ణ కుచేల | తెలుగు | సి.ఎస్.ఆర్., కన్నాంబ, ముక్కామల, రాజశ్రీ,పద్మనాభం |
1963 | చిత్తూరు రాణీ పద్మిని | తమిళం | శివాజీ గణేశన్, వైజయంతిమాల,కె.ఎ.తంగవేలు |
1964 | పతివ్రత | తెలుగు | సావిత్రి, రాజసులోచన, జి.వరలక్ష్మి, ఎస్.వి.రంగారావు,కుచలకుమారి, జెమినీగణేశన్ |
1967 | భక్త ప్రహ్లాద | తెలుగు | రోజారమణి, ఎస్.వి.రంగారావు |