చిత్రాంబరి రాగముకర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 66వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "చతురంగిణి" అని పిలుస్తారు.[2][3] ఇది 30వ మేళకర్త రాగమైన నాగానందిని రాగంప్రతిమధ్యమంతొ సమానంగా ఉంటుంది[4].
11వ చక్ర రుద్ర లో ఇది 6వ రాగం. ఈ రాగానికి ధారణానుకూలైన పేరు రుద్ర-షా.
ఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R2 G3 M2 P D3 N3 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N3 D3 P M2 G3 R2 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, షట్శృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 30వ మేళకర్త రాగమైన నాగానందిని రాగం నకు ప్రతి మధ్యమ సమానం.