చూడాలనివుంది | |
---|---|
దర్శకత్వం | గుణశేఖర్ |
రచన | గుణశేఖర్, దివాకర్ బాబు (సంభాషణలు) |
నిర్మాత | సి. అశ్వనీదత్ |
తారాగణం | చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరి, ప్రకాష్ రాజ్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
సంగీతం | మణి శర్మ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | ఆగస్టు 27, 1998 |
భాష | తెలుగు |
చూడాలని ఉంది 1998లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. చిరంజీవి, సౌందర్య, ప్రకాష్ రాజ్, అంజలా జవేరి ఇందులో ప్రధాన పాత్రధారులు.[1]ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించాడు. దివాకర్ బాబు మాటలు రాశాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, హరిహరన్, ఉదిత్ నారాయణ్, స్వర్ణలత, శంకర్ మహదేవన్, చిత్ర పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. ఈ చిత్ర సంగీతానికి గాను మణిశర్మకు నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.
రామకృష్ణ అనే వ్యక్తి కలకత్తాకు కొత్తగా రావడంతో కథ మొదలవుతుంది. బెంగాలీ భాష తెలియక ఇబ్బంది పెడుతూ ఒక చిన్న అపార్టుమెంటుకు చేరుకుంటాడు. అక్కడ ఇద్దరు తెలుగు వాళ్ళు ఆ అపార్టుమెంటును నిర్వహిస్తూ ఉంటారు. వారితో మాట్లాడి ఎప్పట్నుంచో అద్దె కట్టకుండా ఓ గదిలో ఉంటున్న పద్మావతి అనే తెలుగు అమ్మాయితో పాటు గదిలో దిగుతాడు. పద్మావతిని ప్రేమ పేరుతో మోసం చేసి పారిపోయి ఉంటాడు.
ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, హరిహరన్, ఉదిత్ నారాయణ్, స్వర్ణలత, శంకర్ మహదేవన్, చిత్ర పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు, చంద్రబోస్ పాటలు రాశారు.[2] మణి శర్మకు నంది పురస్కారంతో పాటు ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా దక్కింది.