చెన్నై ఎగ్మోర్-తంజావూరు ప్రధాన రైలు మార్గం | |||
---|---|---|---|
అవలోకనం | |||
స్థితి | పనిచేస్తోంది | ||
లొకేల్ | తమిళనాడు | ||
చివరిస్థానం | చెన్నై ఎగ్మోర్ తంజావూరు జంక్షన్ | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | 1880 | ||
యజమాని | భారతీయ రైఒల్వేలు | ||
నిర్వాహకులు | దక్షిణ రైల్వే | ||
సాంకేతికం | |||
ట్రాక్ పొడవు | ప్రధాన మార్గం: 351 కి.మీ. (218 మై.) శాఖా మార్గాలు: CGL–AJJ (63 కిలోమీటర్లు (39 మై.)) VM–PDY (38 కిలోమీటర్లు (24 మై.)) CUPJ–VRI (61 కిలోమీటర్లు (38 మై.)) MV–TVR (39 కిలోమీటర్లు (24 మై.)) | ||
ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||
అత్యధిక ఎత్తు | చెన్నై ఎగ్మోర్ 8 మీటర్లు (26 అ.) తంజావూరు60 మీటర్లు (200 అ.) | ||
|
చెన్నై ఎగ్మోర్-తంజావూరు ప్రధాన మార్గం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఎగ్మోర్ తంజావూరు జంక్షన్ లను కలుపుతుంది. చెన్నై - విలుప్పురం - చిదంబరం - మైలదుత్తురై - కుంభకోణం - తంజావూరు - తిరుచిరాపల్లి లైన్లో చెన్నై ఎగ్మోర్-తంజావూరు ప్రధాన భాగం. ఇతర శాఖలు: చెంగల్పట్టు - అరక్కోణం చెన్నై సెంట్రల్-బెంగళూరు సిటీ లైన్, గుంతకల్-చెన్నై ఎగ్మోర్ సెక్షన్, విలుప్పురం- పుదుచ్చేరి, కడలూరు - విరుధాచలం, మైలాడుతురై- తిరువారూర్,, పెరళం - నాగపట్నం. ఈ లైన్ కావేరీ డెల్టాను చెన్నైకి కలుపుతుంది.
కోరమాండల్ కోస్ట్‌లోని మీటర్-గేజ్ రైల్వే వ్యవస్థ యొక్క "ప్రధాన లైన్" చెన్నైని తిరుచ్చిరాపల్లితో విలుప్పురం, కడలూరు, చిదంబరం, మైలదుత్తురై, కుంభకోణం, తంజావూరు జంక్షన్ల మీదుగా అనుసంధానించింది. [1] చెన్నై-మైలాడుతురై-తంజావూరు-తిరుచిరాపల్లి లైన్‌ను "ప్రధాన లైన్"గా భావిస్తారు. [2] [3]
1861లో గ్రేట్ సదరన్ ఆఫ్ ఇండియా రైల్వే (GSIR) నాగపట్నం, తిరుచిరాపల్లి మధ్య 125 కి.మీ. (78 మై.) బ్రాడ్ గేజ్ లైన్ నిర్మించింది. ఈ లైన్ ఆ తరువాతి ఏడాది ట్రాఫిక్ కోసం తెరిచారు. [4] 1874లో GSIR నుండి స్వాధీనం చేసుకున్న తర్వాత దక్షిణ భారత రైల్వే కంపెనీ, నాగపట్నం-తిరుచిరాపల్లి లైన్‌ను మీటర్ గేజ్‌గా మార్చింది.
దక్షిణ భారత రైల్వే కంపెనీ, 1880లో చెన్నై నుండి విలుప్పురం, కడలూర్ పోర్ట్, మైలదుత్తురై, తంజావూరు, తిరుచిరాపల్లి, మధురై, విరుదునగర్ మీదుగా తూత్తుకుడి వరకు 715 కి.మీ. (444 మై.) పొడవైన మీటర్-గేజ్ ట్రంక్ లైన్ వేసింది. [5] 84 కి.మీ. (52 మై.) -పొడవున్న తిండివనం-కడలూర్ పోర్ట్ సెక్టార్, 27.60 కి.మీ. (17 మై.) పొడవైన కడలూర్ పోర్ట్-పోర్టో నోవో సెక్టార్, 19.71 కి.మీ. (12 మై.)పొడవైన శ్యాలీ-మయిలదుత్తురై సెక్టార్లను 1877లో మొదలుపెట్టారు. తద్వారా తిండివనాన్ని ఇప్పటికే తెరిచిన తిరుచిరాపల్లి-నాగపట్టినం లైన్‌కు కలిపారు. [6] కానీ 1995-2000 సంవత్సరాలలో గేజ్ మార్పిడి సమయంలో 84 కి.మీ. (52 మై.) -దీర్ఘమైన తిండివనం-కడలూర్ పోర్ట్ సెక్టార్, 27.60 కి.మీ. (17 మై.) -పొడవైన కడలూర్ పోర్ట్-పోర్టో నోవో సెక్టార్ & 19.71 కి.మీ. (12 మై.) -పొడవున్న శ్యాలి-మయిలాడుతురై సెక్టార్‌ను బ్రాడ్ గేజ్ లైనుగా మార్చలేదు.
బ్రిటీష్, ఫ్రెంచి వారి మధ్య ఒక ఒప్పందాన్ని అనుసరించి, 1877-1879లో పుదుచ్చేరి విలుప్పురం మధ్య ఒక 38 కి.మీ. (24 మై.) -పొడవైన మీటర్-గేజ్ లైన్ వేసారు. [7]
అరక్కోణం, కాంచీపురంల మధ్య 1865లో ఇండియన్ ట్రామ్వే కంపెనీ ఒక లైను వేసింది. [4] దీన్ని 1878లో మీటర్ గేజ్‌గా మార్చారు. చెంగల్పట్టు-వాలాజాబాద్ లైన్ 1880లో ప్రారంభించబడింది [6]
1927లో 55 కి.మీ. (34 మై.) పొడవైన రైల్వే ట్రాకు ద్వారా విలుప్పురంను విరుద్ధాచలంకు కలిపారు. [6]
మైలాడుతురై - తరంగంబాడి లైన్‌ను 1926లో వేసారు. బ్రాడ్ గేజ్ మార్పిడి కోసం 1987లో మూసివేసారు. [8] కానీ 33 ఏళ్లుగా ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది
దక్షిణ రేఖలో ప్రధాన భాగం, చెన్నై సబర్బన్ మార్గం. చెన్నైకి దక్షిణంగా ఉన్న ప్రాంతానికి 1931 వరకు ప్యాసింజరు, గూడ్స్ రైళ్ల ద్వారా ఒకే లైను ద్వారా సేవలు అందించేది. ఈ రంగంలో ఎలక్ట్రిక్ రైళ్లను 1923లోనే ప్లాన్ చేశారు. నిర్మాణ పనులు 1926లో ప్రారంభమై 1931లో పూర్తయ్యాయి. చెన్నై బీచ్, ఎగ్మోర్ ల మధ్య ఎలక్ట్రిక్ రైళ్ల కోసం కొత్త లైన్ వేసారు. ఎగ్మోర్, తాంబరం మధ్య డబుల్ లైను వేసారు. [9] మొదటి MG EMU సేవలు 1193 మే 11 న మొదలయ్యాయి. [10] 1960లలో చెన్నై బీచ్-తాంబరం- విలుప్పురం సెక్టార్ 1.5 kV DC ట్రాక్షన్ నుండి 25 kV AC ట్రాక్షన్‌గా మార్చబడింది. EMU సేవలను చెంగల్‌పేట వరకు పరిమితంగా విస్తరించారు. 1969లో తాంబరం-చెంగల్‌పేట మధ్య అదనపు మీటర్‌గేజ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. 1995 నుండి మొత్తం ప్రాంతాన్ని బ్రాడ్ గేజ్‌గా మార్చారు. [10]
మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్కి మారడంతో మొత్తం 494 కి.మీ. (307 మై.) -పొడవైన ఎగ్మోర్ - తాంబరం - తిరుచిరాపల్లి - దిండిగల్ - మధురై సెక్టార్ పూర్తయింది. ప్యాసింజర్ ట్రాఫిక్ 2001 మార్చిలో మొదలైంది. ఆ తరువాత మిగిలిన మార్పిడి పని పూర్తయింది చిట్ట చివరి మీటర్-గేజ్ EMU సేవ 2004 జూలై 1 న తాంబరం, ఎగ్మోర్ మధ్య నడిచింది [11]
విలుప్పురం - పుదుచ్చేరి బ్రాంచ్ లైన్‌ను మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్‌గా మార్చడం 2004లో పూర్తయింది. కడలూరు పోర్టు, వృద్ధాచలం సెక్టారు గేజిమార్పిడిని 2003 లో పూర్తి చేసారు. [12] తంజావూరు - తిరువారూర్ బ్రాడ్-గేజ్ సెక్షన్‌ను 2006లో, తిరువారూర్- నాగోర్ సెక్షన్ 2010లో ముగిసాయి. [13]
192 కి.మీ. (119 మై.) -పొడవైన విలుప్పురం-తంజావూరు మార్గాన్ని 2010 లో బ్రాడ్ గేజ్‌గా మార్చారు. [14]
చెంగల్పట్టును అరక్కోణంతో కలుపుతూ బ్రాడ్-గేజ్ లైన్ (మీటర్-గేజ్ నుండి మార్పిడి) 1999-2000లో నిర్మించారు. అరక్కోణం నేవల్ ఎయిర్ స్టేషన్‌కు సమీపంలో ఉన్నందున థాకోలం-అరక్కోణం సెక్టార్‌ను మార్చాల్సి వచ్చింది. [15] [16]
గ్రేట్ సదరన్ రైల్వే ఆఫ్ ఇండియా, కర్నాటిక్ రైల్వేలు 1874 లో విలీనమై దక్షిణ భారత రైల్వే కంపెనీగా ఏర్పడ్డాయి. [7]
1950ల ప్రారంభంలో, అక్కడ ఉన్న స్వతంత్ర రైల్వే వ్యవస్థలను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తూ చట్టం చేసారు. 1951 ఏప్రిల్ 14 న మద్రాస్ అండ్ సదరన్ మహరాఠా రైల్వే, సౌత్ ఇండియన్ రైల్వే కంపెనీ, మైసూరు స్టేట్ రైల్వేలను కలిపి దక్షిణ రైల్వేగా ఏర్పాటు చేశారు. తదనంతరం, నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేని కూడా దక్షిణ రైల్వేలో విలీనం చేసారు. 1966 అక్టోబరు 2 న, సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లీ, విజయవాడ డివిజన్లు, నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే యొక్క పూర్వ భూభాగాలను, మద్రాస్ అండ్ సదరన్ మహరాఠా రైల్వేలోని కొన్ని భాగాలను దక్షిణ రైల్వే నుండి వేరు చేసి దక్షిణ మధ్య రైల్వేగా ఏర్పరచారు . 1977లో, దక్షిణ రైల్వేలోని గుంతకల్ డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేకు, షోలాపూర్ డివిజన్‌ను సెంట్రల్ రైల్వేకు బదిలీ చేసారు. 2010లో ఏర్పాటైన ఏడు కొత్త జోన్లలో నైరుతి రైల్వే కూడా ఉంది. దీన్ని దక్షిణ రైల్వే నుండి వేరు చేసి ఏర్పాటు చేసారు. [17]
<ref>
ట్యాగు; "irfcaii" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
Gauge conversion to be completed in 1999–2000