వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | వర్తేజ్ , గుజరాత్ | 1998 ఫిబ్రవరి 28
బ్యాటింగు | ఎడమచేతి వాటం |
బౌలింగు | ఎడమచేతి మీడియం ఫాస్ట్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు |
|
ఏకైక వన్‌డే (క్యాప్ 240) | 2021 జూలై 23 - శ్రీలంక తో |
తొలి T20I (క్యాప్ 91) | 2021 జూలై 28 - శ్రీలంక తో |
చివరి T20I | 2021 జూలై 29 - శ్రీలంక తో |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2018–ప్రస్తుతం | సౌరాష్ట్ర |
2021 | రాజస్థాన్ రాయల్స్ |
2022-ప్రస్తుతం | ఢిల్లీ క్యాపిటల్స్ |
మూలం: Cricinfo, 29 జూలై 2021 |
చేతన్ సకారియా, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. భారత క్రికెట్ జట్టు కోసం ఆడిన చేతన్, ప్రస్తుతం దేశీయ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరపున ఆడుతున్నాడు. 2021 జూలైలో భారత క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[1]
చేతన్ 1998, ఫిబ్రవరి 28న గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ నుండి 15 కి.మీ.ల దూరంలోని వర్తేజ్ గ్రామంలో జన్మించాడు.[2] సౌరాష్ట్ర జట్టులో సీనియర్ ఆటగాడు షెల్డన్ జాక్సన్ చేతన్ కు కొత్త షూ కొని, శిక్షణలో సహాయం చేశాడు. ఆ సమయంలో చేతన్ కు ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌కి వెళ్ళే అవకాశం వచ్చింది. జాక్సన్, చేతన్ తర్వాత సన్నిహిత మిత్రులయ్యారు.[2]
చేతన్ సోదరుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021 ఆడుతున్నప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చేతన్ తన సోదరుడికి చాలా సన్నిహితుడు, దీనిని దృష్టిలో ఉంచుకుని, రాజస్థాన్ రాయల్స్ అతనికి అతని దివంగత సోదరుడు 'ఆర్కే' మొదటి అక్షరాలు ఉన్న జెర్సీని బహుమతిగా ఇచ్చింది. జెర్సీపై "మిస్ యూ బ్రో" అని రాసి ఉన్న సందేశం కూడా ఉంది.[3]
2021 మే 9న చేతన్ తండ్రి కోవిడ్-19 తో మరణించాడు.[4]
చేతన్ 2018 ఫిబ్రవరి 22న 2017–18 విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర తరపున తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[5] 2018 నవంబరు 18న 2018-19 రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరపున తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసి,[6] మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసుకున్నాడు.[7] 2019 ఫిబ్రవరి 21న 2018–19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరపున ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[8] 2021 ఫిబ్రవరిలో 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు జరిగిన ఐపిఎల్ వేలంలో చేతన్ ను రాజస్థాన్ రాయల్స్ 1.2 కోట్లకు కొనుగోలు చేసింది.[9][10]
2021 జూన్ లో చేతన్ శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం అంతర్జాతీయ వన్డే , ట్వంటీ 20 స్క్వాడ్‌లలో ఎంపికయ్యాడు.[11] 2021, జూలై 23న శ్రీలంకపై భారతదేశం తరపున వన్డేల్లోకి అరంగేట్రం చేసాడు.[12] తొలి అంతర్జాతీయ వికెట్ భానుక రాజపక్సే, [13] 38 పరుగులకు 2 వికెట్లు సాధించాడు.[14] 2021 జూలై 28న భారతదేశం తరపున శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[15]
2022 ఫిబ్రవరిలో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని కొనుగోలు చేసింది. [16]