ఛవీ పాండే | |
---|---|
జననం | పాట్నా, బీహార్, భారతదేశం | 1986 జూలై 18
వృత్తి | నటి గాయని |
క్రియాశీలక సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
ప్రసిద్ధి | ఏక్ బూంద్ ఇష్క్ సిల్సిలా ప్యార్ కా |
ఛవీ పాండే, భారతీయ టెలివిజన్ నటి. ఆమె లైఫ్ ఓకే టెలివిజన్ ఛానల్ ఏక్ బూంద్ ఇష్క్ లో తారా, స్టార్ భారత్ మిస్టరీ థ్రిల్లర్ కాల్ భైరవ్ రహస్యలో నమ్రతా సింగ్, సోనీ టీవీ లేడీస్ స్పెషల్ 2లో ప్రార్థన కశ్యప్, అనుపమలో ఉత్తర/మాయ పాత్రలకు ప్రసిద్ధి చెందింది.[1][2]
ఛవీ పాండే భారతీయ శాస్త్రీయ నృత్యం కథక్ నేర్చుకుంది. వృత్తిపరమైన గాయని కూడా. ఆమె శాస్త్రీయ సంగీతంలో న్యూఢిల్లీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుండి జాతీయ పండితురాలు.
ఆమె మొదటిసారిగా 2008లో కలర్స్ టీవీలో ప్రసారమైన ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 1లో పాల్గొని సెమీ-ఫైనలిస్ట్ గా నిలిచింది. ఆ తర్వాత, ఆమె దినేష్ లాల్ యాదవ్ సరసన భోజ్‌పురి చిత్రం బిడేసియాలో చేసింది. జనవరి 2012లో ఆమె స్టార్ ప్లస్ షో సాంగ్ మేరే డోల్ తూలో ఉంది.[3][4]
సెప్టెంబరు 2013లో, ఆమె లైఫ్ ఓకే షో ఏక్ బూండ్ ఇష్క్ లో నటుడు విరాఫ్ పటేల్ సరసన కనిపించింది. స్టార్ ప్లస్ తేరి మేరీ లవ్ స్టోరీస్ చిత్రంలో ఆమె స్మితగా నటించింది. 2015లో, ఆమె బంధన్-సారీ ఉమర్ హమే సంగ్ రెహ్నా హై అనే ధారావాహికలో దర్పణ్ కార్నిక్ ప్రధాన పాత్రను పోషించింది.
ఆ తరువాత, 2016లో ఆమె స్టార్ ప్లస్ సిల్సిలా ప్యార్ కా షోలో కనిపించింది. 2017 నుండి 2018 వరకు ఆమె స్టార్ భారత్ లో ప్రసారమైన సస్పెన్స్ థ్రిల్లర్ కాల్ భైరవ్ రహస్య సీరియల్లో ప్రధాన ప్రతినాయిక అయిన నమ్రతా సింగ్ పాత్ర పోషించింది. 2018 చివరలో, విక్రమ్ బేతాళ్ కీ రహస్య గాథలో మహారాణి పద్మిని పాత్రను ఆమెకు ఆఫర్ చేశారు, కానీ తరువాత ఆమె ఆ పాత్రను తిరస్కరించింది. 2018 నుండి 2019 వరకు ఆమె లేడీస్ స్పెషల్ లో ప్రార్థన కశ్యప్ ప్రధాన పాత్ర పోషించింది. జనవరి 2023 నుండి జూలై 2023 వరకు, ఆమె అనుపమ ఉత్తర అలియాస్ మాయ పాత్రను పోషించింది.[5]
సంవత్సరం | సీరియల్ | పాత్ర |
---|---|---|
2008 | ఇండియాస్ గాట్ టాలెంట్ 1 | పోటీదారు |
2012 | తేరి మేరీ లవ్ స్టోరీస్ | డాక్టర్ స్మితా కుమారి బన్సాల్ |
2013–2014 | ఏక్ బూంద్ ఇష్క్ | తారా సింగ్ షెకావత్ |
2014 | యే హై ఆషికి | దృష్టి |
2015 | బంధన్-సారీ ఉమర్ హమే సంగ్ రెహ్నా హై | దర్పణ్ కర్ణిక్/రియా ఖరే |
2016 | సిల్సిలా ప్యార్ కా | కాజల్ సక్సేనా |
2017 | శౌర్య వీర్ ఏకలవ్య కి గాథా | సనత్రి |
2017–2018 | కాల్ భైరవ్ రహస్య | నమ్రతా సింగ్ |
2018–2019 | లేడీస్ స్పెషల్ | ప్రార్థన కశ్యప్ |
2019–2020 | అప్నా న్యూస్ ఆయేగా | చుల్బులి పాండే |
2019 | నమస్ | దేవి పార్వతి |
2020 | తేరా క్యా హోగా ఆలియా | తారా కోహ్లీ |
2020–2021 | ప్రేమ్ బంధన్ | జానకి శ్రీవాస్తవ శాస్త్రి/జయ కపూర్ |
2021–2022 | శుభ్ లాబ్-ఆపకే ఘర్ మే[6] | దేవి లక్ష్మి |
దివ్య | ||
2022 | దేవి అలక్ష్మి | |
2023 | అనుపమ | ఉత్తరా/మాయ [7] |
2023–2024 | పూర్ణిమ | పూర్ణిమ సిద్ధార్థ్ సింగ్ |