ఛెల్లో షో | |
---|---|
![]() 2019లో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఛెల్లో షో షూటింగ్‌లో పాన్ నలిన్ | |
దర్శకత్వం | పాన్ నలిన్ |
రచన | పాన్ నలిన్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | స్వప్నిల్ ఎస్. సోనావానే |
కూర్పు | శ్రేయాస్ బెల్టాంగ్డి పవన్ భట్ |
సంగీతం | సిరిల్ మోరిన్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | సిద్ధార్థ్ రాయ్ కపూర్(రాయ్ కపూర్ ఫిల్మ్స్)[1] |
విడుదల తేదీs | 10 జూన్ 2021(ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్) 14 అక్టోబరు 2022 (భారతదేశం) |
సినిమా నిడివి | 110 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | గుజరాతీ |
ఛెల్లో షో లేదా ఛెల్లో శో[గమనిక 1] (అర్థం: చివరి షో, గుజరాతీ: છેલ્લો શો) పాన్ నళిన్ దర్శకత్వం వహించిన 2021 గుజరాతీ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా చిత్రం. ఇందులో భవిన్ రాబారి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్, పరేష్ మెహతా నటించారు.[2] ఈ చిత్రం తొలిసారి 20వ ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో 2021 జూన్ 10న ప్రదర్శించారు. స్పెయిన్‌లో జరిగిన వల్లాడోలిడ్ చిత్రోత్సవంలో గోల్డెన్ స్పైక్ పురస్కారంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు ఇప్పటికే గెలుచుకుంది.
గుజరాత్‌లోని ఓ మూరుమూల పల్లెటూరులో జరిగే కథతో తెరకెక్కిన ఛెల్లో షో 95వ అకాడెమీ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రానికి భారతీయ ఎంట్రీగా ఎంపికైంది.[3][4] కాగా ఈ సినిమా ‘ది లాస్ట్ షో’ పేరుతో దేశవ్యాప్తంగా 2022 అక్టోబరు 14న ఆంగ్ల భాషలో థియేటర్‌లలో విడుదల కానుంది.
ఛెల్లో షో సినిమాలో నటించిన ఆరుగురు బాలనటుల్లో ఒకడైన 10 ఏళ్ళ రాహుల్ కోలీ మృతి చెందాడు. రాహుల్ కోలీ గత కొంతకాలంగా ల్యుకేమియాతో పోరాడుతూ పరిస్థితి విషమించడంతో 2022 అక్టోబరు 2న కన్నుమూశాడు. [5]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)