జగదీష్ | |
---|---|
![]() | |
జననం | జగదీష్ ప్రతాప్ బండారి 18 జనవరి 1993 |
జాతీయత | ![]() |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2018- ప్రస్తుతం |
తల్లిదండ్రులు | చంద్రమౌళి, లలిత |
జగదీష్ ప్రతాప్ బండారి తెలుగు సినిమారంగానికి చెందిన నటుడు. 2019లో విడుదలైన మల్లేశం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో విడుదలైన పుష్ప సినిమాతో కేశవ పాత్రకు మంచి గుర్తింపునందుకున్నాడు.[1]
జగదీష్ తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం, చిన్నకోడెపాక గ్రామంలో చంద్రమౌళి, లలిత దంపతులకు జన్మించాడు. ఆయన 6వ తరగతి వరకు చిన్నకోడెపాక గ్రామంలో, నుండి వరకు పెంబర్తిలోని ఏకశిల పాఠశాలలో పూర్తి చేసి, హనుమకొండలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ (బైపీసీ), ఎల్.బి. కళాశాలో బీఎస్సీ (పౌల్ట్రీ సైన్స్) పూర్తి చేశాడు.[2]
జగదీష్ సినీరంగంలోకి రాకముందు పలు లఘు చిత్రాల్లో నటించాడు. ఆయన నటించిన నిరుద్యోగ నటులు, కొత్త పోరడు లఘు చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. జగదీష్ 2019లో ప్రియదర్శి హీరోగా వచ్చిన మల్లేశం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హీరో స్నేహితుడిగా చిన్న పాత్రలో నటించాడు. ఆయన 2020లో కరుణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన పలాస 1978 సినిమాలో నటించిన అనంతరం 2021లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా పుష్పరాజ్ స్నేహితుడు కేశవ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[3][4]
సంవత్సరం | సినిమా | పాత్ర పేరు | ఇతర విషయాలు | |
---|---|---|---|---|
2019 | మల్లేశం | అంజి | ||
జార్జ్ రెడ్డి | భీమ్ నాయక్ | |||
2020 | పలాస 1978 | ముత్యాలు | ||
2021 | పుష్ప | కేశవ | [5][6] | |
2022 | పిక్ పాకెట్ | జగ్గు | [7] | |
విరాట పర్వం | అతిధి పాత్ర | |||
వాంటెడ్ పండుగాడ్ | ||||
2023 | బుట్టా బొమ్మ | |||
సత్తి గాని రెండు ఏకరాలు | సతి | |||
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ | అభినయ్ స్నేహితుడు | |||
ఓ కథ | అశోక్ | |||
2024 | అంబాజీపేట మ్యారేజి బ్యాండు | సంజీవ్ | ||
డబుల్ ఇంజిన్ | - | నేపథ్య గాయకుడిగా, గీత రచయితగా | ||
పుష్ప 2 | కేశవ "మొండేలు" | [8] | ||
TBA | చివరికు మిగిలేది † | TBA | ||
TBA | పిక్ పాకెట్ 2: ది మర్డర్ ప్లాన్ † | TBA |
సంవత్సరం | లఘు చిత్రం \ వెబ్ సిరీస్ | పాత్ర | ఇతర విషయాలు | |
---|---|---|---|---|
2018 | నిరుద్యోగ నటులు | జగదీశ్ | మైక్ టీవీ యూ ట్యూబ్ షో | |
2019 | గాడ్స్ అఫ్ ధర్మపురి | చలపతి | జీ5 వెబ్ సిరీస్ | |
2020 | కొత్త పోరడు | అడ్డగుట్ట మల్లేష్ | ఆహా వెబ్ సిరీస్ | [9] |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link)