జగన్నాథ్ మిశ్రా (24 జూన్ 1937 [1][2] - 19 ఆగస్టు 2019) బీహార్ ముఖ్యమంత్రిగా[3]కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన భారతీయ రాజకీయ నాయకుడు. [4][5] అతను 1988 - 1990 1994 - 2000 మధ్య పార్లమెంటు, రాజ్యసభ కు ఎన్నికయ్యాడు. జగన్నాథ్ మిశ్రా బీహార్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు ఎన్నికయ్యారు.
జగన్నాథ్ మిశ్రా 82 సంవత్సరాల వయస్సులో 19 ఆగస్టు 2019న ఢిల్లీ ఆసుపత్రిలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో మరణించారు. [6][7] ఆయన మరణం తర్వాత బీహార్‌లో మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. సుపాల్ జిల్లాలోని అతని పూర్వీకుల గ్రామమైన బలువా బజార్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఇతని మరణానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం తెలిపారు.