జగ్గయ్యపేట

పట్టణం
పటం
Coordinates: 16°53′31″N 80°05′51″E / 16.892°N 80.0976°E / 16.892; 80.0976
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండలంజగ్గయ్యపేట మండలం
విస్తీర్ణం
 • మొత్తం23.5 కి.మీ2 (9.1 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం53,530
 • జనసాంద్రత2,300/కి.మీ2 (5,900/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1021
ప్రాంతపు కోడ్+91 ( 08654 Edit this on Wikidata )
పిన్(PIN)521175 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

జగ్గయ్యపేట, (బేతవోలు) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పట్టణం, బౌద్ధ చారిత్రక ప్రదేశం. ఈ పట్టణం హైదరాబాదు-విజయవాడ జాతీయ రహదారిలో జగ్గయ్యపేట ఉంది. ఈ పట్టణం జిల్లా కేంద్రం విజయవాడ నుండి 82 కిమీ, రాష్ట్ర రాజధాని అమరావతి నుండి సుమారు 80 కి.మీ. దూరంలో పాలేటి నది ఒడ్డున, కృష్ణా నదికి 10 కి.మీ.ల దూరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంది.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]
జగ్గయ్యపేట స్తూపం లోని ఒక భాగం

దీని పూర్వనామం బేతవోలు. రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు తన తండ్రి పేర కట్టించిన పట్టణమిది. ఈయన గొప్ప శివ భక్తుడు. అతడు పరమభక్తుడు, ఆ భక్తితోనే ఎన్నో శివాలయాలు, విష్ణ్వాలయాలు కట్టించాడు. అతడి తండ్రి పేరు జగ్గయ్య మీద జగ్గయ్యపేటనూ, తల్లి అచ్చమ్మ పేరు మీద అచ్చంపేటనూ స్థాపించాడని ప్రతీతి. ఆ కాలపు కవులు ఈ విషయాన్ని తమ కవిత్వం ద్వారా తెలిపారు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం వాసిరెడ్డికి ముందే ఈ ప్రదేశం జనావాసంగా ఉందనీ, బేతవోలు అనే పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని వాసిరెడ్డి అభివృద్ధి పరచి జగ్గయ్యపేట అనే పట్టణంగా తీర్చిదిద్దాడని తెలుస్తోంది. రాజుకి ముందు ఈ గ్రామములో దొంగలుండేవారనీ, అందువలన ఈ ఊరి పేరు దొంగల బేతవోలుగా పరిగణించబడేదనీ తెలుస్తూంది. కొంత కాలం పాటూ ప్రభుత్వ రికార్డుల్లోనూ కొందరి దస్తావేజుల్లోనూ బేతవోలనే పేరుతోనే వ్యవహరించబడింది.

చరిత్ర

[మార్చు]
జగ్గయ్యపేట వద్ద బౌద్ధ మహా స్తూపం

జగ్గయ్యపేటకు తూర్పున ఉన్న శిథిలాలు, ఇక్కడ బౌద్ధ నివాసాలు ఉన్నట్టు తెలుపుతున్నాయి. ఇవి దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైనవని నమ్ముతారు.

కట్టడాలు

[మార్చు]
ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల పటం

1818 లో జరిగిన తవ్వకాల్లో కొన్ని కట్టడాలు బయల్పడ్డాయి, అవి ఇక్కడ స్తూపాల సమూహం ఉందనటానికి ఋజువులు. మొత్తం తవ్వకం అయ్యాక 9 మీటర్ల వ్యాసం గల ఒక స్తూపం వెలుగులోకి వచ్చింది, అది తయారు చేయటానికి వాడిన పదార్థాలు, అలంకరణలు, అమరావతిలోవిలా ఉన్నాయి. జగ్గయ్యపేట పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఒక కొండ వద్ద ఒక చైత్యానికి సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ కొండని ధనంబొదు లేదా ధనం కొండ అంటారు.
ఇక్కడ వెలికితీసిన విగ్రహాలు మద్రాస్ మ్యూజియంలో ఉన్నాయి. అందులో చాలా వరకూ తునకలైపోయి ఉన్నవే. అందులో ఒక విభిన్నమయిన బుద్ధుని విగ్రహం ఉంది. అది నిలబడి ఉన్న బుద్ధుని విగ్రహం. 6వ శతాబ్దం నాటి లిపి ఆ విగ్రహం కింద ఉన్న తామరపువ్వు పై చెక్కబడి ఉంది. మిగతా అన్ని అవశేషాలు ఇంకా పురాతనమయినవిగా ఆ ఒక్క విగ్రహం సా.శ.పూ. 200 దిగా గుర్తించారు పురాతత్వ శాస్త్రజ్ఞులు. ఆ విగ్రహం నాగార్జునాచార్యుని శిష్యుడయిన జయప్రభాచార్య ఆదేశాల మేరకు చెక్కబడిందిగా తెలుస్తోంది.
అన్నిటికంటే ముఖ్యమయిన విషయం ఇక్కడి ఒక పాలరాతి శిల. అందులో ఒక చక్రవర్తి, అతని చుట్టూ రాణి, రాకుమారుడు, మంత్రి, ఏనుగు, గుర్రం, చక్రం, మాణిక్యాలు అతడ్ని రాజాధిరాజుగా చూపటం. ఆ చక్రవర్తిపై చతురస్రాకారంలోని నాణాలు ఆకాశం నుండి కనకవర్షంలా కురవటం, ఇంకా అన్ని విగ్రహాలకు అద్భుతమయిన నగలు ఉండటం, అప్పటి స్థపతి శిల్పకళకు దూరంగా ఉండటం విశేషాలు. ఇది కాక పుణ్యశాల అనే రెండంతస్తుల గుహాలయం ఇక్కడి విశేషాలు.

వాడుకలోని మరికొన్ని కథలు

[మార్చు]
జగ్గయ్యపేట బౌద్ధ స్తూపం వద్ద బౌద్ధ విగ్రహ అవశేషం

నందిగామ-జగ్గయ్యపేట మధ్య ఉన్న కొంగర మల్లయ్య గుట్టు గురించి ఒక కథ చెపుతారు. కొంగర మల్లయ్య ఒక గజదొంగ అని, దారేపోయే వాళ్ళని గట్టిగా అరచి భయపెట్టి "మీ దగ్గర ఉన్న మూటా, ముల్లె అక్కడపెట్టి పారిపొమ్మని" అరచేవాడట. బాటసారులు భయపడి వారి నగానట్రా వదలి పారిపోయేవారుట. చాలా కాలానికి ఎవరో ధైర్యవంతుడు వలన ఆ మల్లయ్య కాళ్ళు లేని వాడని తెలిసిందిట.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం జగ్గయ్యపేట మండలం పూర్తి జనాభా 1,07,290. మొత్తం ఇళ్ళు- 24, 341. 30 గ్రామాలు 18 పంచాయితీలు కలిసినది ఈ మండలం. జగ్గయ్యపేట ఈ మండలంలోని ముఖ్య పట్టణం. ఈ పట్టణం జానాభా 40,373; స్త్రీ-పురుష నిష్పత్తి 49:51 శాతంగా ఉంది. అక్షరాస్యత 67%. పురుషుల అక్షరాస్యత 73%, స్త్రీల అక్షరాస్యత 60%. 11 శాతం జనాభా 6 సంవత్సరాల లోపు పిల్లలు.

పరిపాలన

[మార్చు]

జగ్గయ్యపేట పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

కళాశాలలు

[మార్చు]
  • శ్రీమతి గెంటేల శకుంతలమ్మ (ఎస్.జి.ఎస్) కళాశాల: "విశ్వేశ్వరయ్య బొటానికల్ పార్క్" ను, 2017,జులై-11న ప్రారంభించారు. విద్యార్థుల పరిశోధనలకు అవసరమైన అరుదైన మొక్కలను పెంచేందుకు ఇది దోహదపడుతుంది.
  • వాగ్దేవి మహిళా జూనియర్ & డిగ్రీ కళాశాలలు
  • మండవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (M.I.E.T)
  • ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల.
  • విస్వాబారతి డిగ్రీ కాలేజ్ (V.B.D.C)

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • బుద్ధ విహార్:- జగ్గయ్యపేట పట్టణంలో 100 ఎకరాలలో విస్తరించియున్న చెరువు చుట్టూ రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక రహదారి, మధ్యలో బుద్ధుని విగ్రహం, చెరుచు అంచులచుట్టూ హరితహారం వంటి అనేక హంగులతో ఇది రూపుదిద్దుకుంటున్నది. పట్టణవాసులు సాయంత్రం సమయంలో అక్కడకు వెళ్ళి సేదతీరవచ్చు
  • శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి దేవస్థానము, జగ్గయ్యపేట:- ఈ దేవాలయానికి అనుమంచిపల్లి గ్రామంలో 5.55 ఎకరాల (మెట్టభూమి) మాన్యంభూమి ఉంది.[ఆధారం చూపాలి]

ప్రముఖులు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018

వెలుపలి లంకెలు

[మార్చు]