'జగ్మోహన్' మల్హోత్రా ( 1927 సెప్టెంబరు25- 2021 మే 3), జగ్మోహన్ ఒకే పేరుతో పిలుస్తారు, ఒక భారతీయ పౌర సేవకుడు . రాజకీయవేత్త.[1] అతను మొదట్లోభారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలం ఆ పార్టీలో పనిచేశాడు, జగ్మోహన్ 1995లో భారతీయ జనతా పార్టీ చేరారు. ఆయన ఢిల్లీ గోవాకు గవర్నర్గా పనిచేశాడు, జగ్మోహన్ న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎంపీగా గెలిచాడుజగ్మోహన్ కేంద్ర పట్టణాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.[2]
జగ్మోహన్ మల్హోత్రా | |
---|---|
జమ్మూ కాశ్మీర్ గవర్నర్ల జాబితా | |
In office 1990 జనవరి 19 – 1990 మే 26 | |
అంతకు ముందు వారు | కె. వి. కృష్ణారావు |
తరువాత వారు | గిరీష్ చంద్ర |
In office 1984 ఏప్రిల్ 26 – 1989 జులై 11 | |
అంతకు ముందు వారు | బ్రజ్ కుమార్ నెహ్రూ |
తరువాత వారు | కె. వి. కృష్ణారావు |
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లు | |
In office 1982 సెప్టెంబర్ 2 – 1984 ఏప్రిల్ 25 | |
అంతకు ముందు వారు | సుందర్ లాల్ ఖురానా |
తరువాత వారు | పీజీ గువాయ్ |
In office 1980 ఫిబ్రవరి 17 – 1981 మార్చి 30 | |
అంతకు ముందు వారు | దిలీప్ రాయ్ కోహ్లీ |
తరువాత వారు | సుందర్ లాల్ ఖురానా |
[[గోవా గవర్నర్ల జాబితా ]] | |
In office 1981 మార్చి 31 – 1982 ఆగస్టు 31 | |
అంతకు ముందు వారు | పిఎస్ గిల్ |
తరువాత వారు | ఐ.హెచ్.లతీఫ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1927 సెప్టెంబర్ 25 హఫీజాబాద్ పంజాబ్ భారతదేశం |
మరణం | 2021 మే 3 ఢిల్లీ, భారతదేశం | (వయసు 93)
జీవిత భాగస్వామి | ఉమా జగ్మోహన్ |
సంతానం | దీపిక కపూర్ మన్మోహన్ |
పురస్కారాలు | పద్మ విభూషణ్ (2016) పద్మభూషణ్ (1977) పద్మశ్రీ (1971) |
జగ్మోహన్ మల్హోత్రా పంజాబీ హిందూ ఖత్రి కుటుంబంలో అమీర్ చంద్ ద్రోపాడి దేవి దంపతులకు 1927 సెప్టెంబరు 25న బ్రిటిష్ ఇండియా లోని హఫీజాబాద్ లో జన్మించారు.[3] జగ్మోహన్ 1957లో ఉమను వివాహం చేసుకున్నారు. [<span title="This claim needs references to reliable sources. (October 2021)">citation needed</span>]
జగ్మోహన్ జార్జెస్-యుజీన్ హాస్స్మన్ ను ఆదర్శంగా తీసుకున్నాడు.[4] 1970ల మధ్యలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్గా జగ్మోహన్ అక్రమాలకు పాల్పడ్డాడని అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. ఈ సమయంలో జగ్మోహన్ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సలహాదారుగా పనిచేశాడు జగ్మోహన్ ఇందిరా గాంధీ కుమారుడు.సంజయ్ గాంధీతో సన్నిహితంగా ఉండేవాడు. అత్యవసర పరిస్థితి సమయంలో సంజయ్ గాంధీ ఢిల్లీని "అందంగా తీర్చిదిద్దే" పనిని జగ్మోహన్ కు అప్పగించాడు, ఈ పని ద్వారా ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున మురికివాడలను లేకుండా చేయగలిగాడు. జగ్మోహన్ ఈ పనిని చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. 1971 లో జగ్మోహన్ భారతదేశ నాల్గవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ,ని అందుకున్నాడు.1977 లో భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.
1982లో ఢిల్లీ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, జగ్మోహన్ ఢిల్లీ నగరానికి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలు విజయవంతమయ్యాయి. దీంతో జగ్మోహన్ పేరుపొందాడు. తరువాత ఢిల్లీ అలీన శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది, ఇది కూడా విజయవంతమైంది.
జగ్మోహన్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఉన్నప్పుడు 1986 కాశ్మీర్ అల్లర్లు జరిగాయి దీంతో జమ్ము కాశ్మీర్లో, కర్ఫ్యూ విధించారు, కర్ఫ్యూ వార్తలను ప్రసారం చేయకుండా మీడియాపై నిషేధం విధించారు. జమ్ము కాశ్మీర్లో కేంద్ర పోలీస్ బలగాలను మోహరించారు. దీనిపై స్పందించిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో జగ్మోహన్ తమ దేశానికి భయపడి పారిపోతున్నాడని ఆరోపించింది .[5][6][7] జమ్మూ కాశ్మీర్లో జగ్మోహన్ అనేక హిందూ దేవాలయాలను నిర్మించారు, జమ్మూ కాశ్మీర్లోని హిందువుల ప్రత్యేక పుణ్యక్షేత్రాలలో ఒకటైన మాతా వైష్ణో దేవి ఆలయంలో భద్రతను పెంచిన ఘనత జగ్మోహన్ కు దక్కింది. జగ్మోహన్ ఆలయాల పర్యవేక్షణ కోసం ఒక బోర్డును ఏర్పాటు చేసి, దేవాలయాల అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయబడ్డాయి యాత్రికులకు సౌకర్యాన్ని అందిస్తూనే ఉన్నాయి.
1990లో జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదం తిరిగి మొదలు కావడంతో, జగ్మోహన్ ను అప్పటి భారత దేశ ప్రధానమంత్రి వి. పి. సింగ్ నేతృత్వంలోని జనతా దళ్ ప్రభుత్వం రెండోసారి జగ్మోహన్ ను జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా నియమించింది.[8][9] జగ్మోహన్ జమ్మూ కాశ్మీర్ కు రెండవసారి గవర్నర్ గా ఉన్నప్పుడు, 60 మందికి పైగా పౌరులను భారత పారామిలిటరీ దళాలు చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1994లో జగ్మోహన్ బిజెపిలో చేరారు. అయితే, ముఫ్తీ మహ్మద్ సయీద్ రూపొందించిన కాశ్మీర్లో చట్టవ్యతిరేక అణిచివేత చర్యలలో అతను పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి.[10]
జగ్మోహన్ 1996లో 11వ లోక్ సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలీవుడ్ స్టార్ నటుడు రాజేష్ ఖన్నా పై 58,000 ఓట్ల మెజారిటీతోజగ్మోహన్ విజయం సాధించాడు. 1998 1999 భారత సాధారణ ఎన్నికలలో, జగ్మోహన్ భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన ఆర్. కె. ధావన్ను రెండుసార్లు ఓడించి వరుసగా న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.
1998లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజపేయి మంత్రి వర్గంలో, జగ్మోహన్ కమ్యూనికేషన్స్, పట్టణ అభివృద్ధి, పర్యాటక శాఖల మంత్రిగా పనిచేశారు. 1990లలో, జగ్మోహన్ రాజ్యసభకు నామినేట్ అయి మొదటిసారి ఎంపీగా పనిచేశాడు, జగ్మోహన్ 1996,1998 1999లో న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచాడు.
2004 భారత సాధారణ ఎన్నికలలో జగ్మోహన్ భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన అజయ్ మాకెన్ చేతిలో 12,784 ఓట్ల తేడాతో ఓడిపోయారు.[11]
2019లో, ఆర్టికల్ 370 & 35ఎ రద్దు వల్ల జమ్ము కాశ్మీర్ కు కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి బిజెపి నిర్వహించిన సభలో జగ్మోహన్ పాల్గొన్నారు.[12]
జగ్మోహన్, "ఢిల్లీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, అమలు, ఢిల్లీలో ప్రాజెక్టుల ప్రణాళిక, అమలులో మార్గదర్శక పాత్ర పోషించినందుకు గాను భారత ప్రభుత్వం" 1971 జనవరి 26న పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
జగ్మోహన్ ఐదు కోట్ల రూపాయలతో ఢిల్లీ నగర రూపురేఖలను మార్చాడు, ఢిల్లీ నగరంలో మురికివాడలు లేకుండా చేశాడు. ఈ తరహా ఆవిష్కరణలు చేయడం ఆయనకు మాత్రమే సొంతమైంది.జగ్మోహన్ చేసిన అద్భుతమైన సేవలకు గాను భారత ప్రభుత్వం" 1977లో ఆయనకు భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డు ను ఇచ్చి సత్కరించింది. 2016లో జగ్మోహన్ కు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. అతను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పనిచేసి ఢిల్లీ ప్రజల మన్ననలు పొందాడు అతను ఢిల్లీ నగరంలో చేసిన కార్యక్రమాలకు గాను విమర్శకుల ప్రశంసలు పొందాడు.
పేద, ఉపాంత విద్యార్థులకు వసతి, ఇతర సౌకర్యాలతో పాటు సివిల్ సర్వీసెస్ పరీక్షల శిక్షణను అందించే సంకల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులలో జగ్మోహన్ ఒకరు. ఆయన "కాశ్మీర్లో నా ఘనీభవించిన అల్లర్లు" అని రాశారు.
జగ్మోహన్ మల్హోత్రా 93 సంవత్సరాల వయసులో 2021 మే 3న ఢిల్లీలో మరణించారు.[13]
1990లలో, జగ్మోహన్ 1990 నుండి 1996 వరకు రాజ్యసభ (భారత పార్లమెంటు ఎగువ సభ) నామినేటెడ్ ఎంపీగా పనిచేశారు. తరువాత, ఆయన న్యూఢిల్లీ నుండి మూడుసార్లు లోక్సభకు (భారత పార్లమెంటు దిగులోక్ సభ) ఎన్నికయ్యారు.