జనతా హోటల్ | |
---|---|
దర్శకత్వం | అన్వర్ రషీద్ |
రచన | అంజలి మీనన్ |
నిర్మాత | సురేష్ కొండేటి |
తారాగణం | దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ |
ఛాయాగ్రహణం | ఎస్.లోకనాథన్ |
కూర్పు | ప్రవీణ్ ప్రభాకర్ |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | ఎస్.కె. పిక్చర్స్ |
విడుదల తేదీ | 14 సెప్టెంబరు 2018 |
సినిమా నిడివి | 150 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జనతా హోటల్ 2018లో విడుదలైన తెలుగు సినిమా.[1] మలయాళంలో 2012లో ఉస్తాద్ హోటల్ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో జనతా హోటల్ పేరుతో ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి నిర్మించాడు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అన్వర్ రషీద్ దర్శకత్వం వహించగా సెప్టెంబర్ 14, 2018న విడుదలైంది.
ఫైజల్ (దుల్కర్ సల్మాన్) సంపన్న కుటుంబానికి చెందిన అబ్బాయి, అతనికి చెఫ్ కావాలని ఆశ. స్విట్జర్లాండ్ వెళ్లి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాని తండ్రికి అబద్దం చెప్పి చెఫ్ కోర్స్ చేసి ఇండియా వస్తాడు. తన సొంత ఊరు వెళతాడు. అక్కడ తన తాత నడుపుతున్న హోటల్‌కి వెళతాడు. ఆ హోటల్ కథ ఏంటి ? చెఫ్ కావాలనుకునే ఫైజల్ ఆ హోటల్ యజమానిగా బాధ్యతలు చేపడతాడా ? విదేశాలు తిరిగి వెళ్లిపోతాడా? అనుకోకుండా పరిచయమైన షహానా (నిత్యామీనన్) కారణంగా ఫైజల్ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేదే మిగతా సినిమా కథ.[2]