జయ సీల్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1999–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | బిక్రమ్ ఘోష్[1] |
జయ సీల్, అస్సాం రాష్ట్రానికి చెందిన నటి, నర్తకి.[2] ఇందిరా పిపి బోరా వద్ద ఐదు సంవత్సరాల పాటు భరతనాట్యం నేర్చుకున్న జయ, నాటకాలలో, అస్సామీ టెలివిజన్ సీరియళ్ళలో, సినిమాలలో నటించింది. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరి, 1977లో మూడేళ్ళ కోర్సును పూర్తిచేసింది.
జయ అస్సాంలోని గౌహతిలో జన్మించింది. బొంబాయికి వెళ్ళి అక్కడ ప్రముఖ నటీమణులలో ఒకరిగా ఎదిగింది. అనేక యాడ్ కమర్షియల్‌లలో నటించడమే కాకుండా 8 భాషలలో 19 సినిమాలలో నటించింది. వెనిస్, పుస్సాన్ వంటి ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జయ నటించిన కొన్ని సినిమాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. బుద్ధదేబ్ దాస్‌గుప్తా రూపొందించిన ఉత్తర సినిమాలో నటించి 2000 సంవత్సరంలో ఉత్తమ నటిగా ఎంపికైంది. 2004లో వచ్చిన ' కహానీ ఘర్ ఘర్ కీ'లో పాపులర్ సీరియల్‌లో కూడా ప్రధాన పాత్రలో నటించింది. చల్, ఎక్స్‌క్యూస్ మీ (హిందీ), ప్రభుదేవాతో పెన్నిమనాతైతొట్టు (తమిళం), విక్రమ్ తో సరసన సమురాయ్ (తమిళం), శివరాజ్ కుమార్ తో బహలా చన్నా గిదే (కన్నడ) సినిమాలలో నటించింది. ముంబైలో ఉన్న సమయంలో లాస్య అకాడమీలో గురు వైభవ్ అరేకర్, గురు రాజశ్రీ షిర్కే దగ్గర శిక్షణ పొంది, ఆ తర్వాత నరేష్ పిళ్లై దగ్గర శిక్షణ తీసుకుంది. కోల్‌కతాకు వచ్చి 2005లో గురు తంకమణి కుట్టి మార్గదర్శకత్వంలోని కళామండలం చేరొ, బిదుషి రమా వైద్యనాథన్ దగ్గర తన శిక్షణను కొనసాగిస్తోంది. అనేక ప్రతిష్టాత్మక వేదికలలో నృత్య కళాకారిణిగా రాణించింది. నాటకరంగ కళాకారిణి ఉషా గంగూలీతో కలిసి ఆమె నిర్మించిన ఛండాలికలో ప్రధాన కథానాయికగా నటించింది. అపర్ణా సేన్ దర్శకత్వంలో ఆర్షినగర్ సినిమాలో, దీప్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన జాతీయ అవార్డు పొందిన అలీఫా సినిమాలో నటించింది.
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1999 | అమృత | హిందీ | ||
2000 | పెన్నిన్ మనతై తొట్టు | సునీత | తమిళం | |
2000 | శేష్ తికాన | శ్రీరాధ | బెంగాలీ | |
2000 | ఉత్తరా | ఉత్తరా | ||
2001 | కలకలప్పు | తిలగా | తమిళం | |
2001 | బహలా చెన్నగిదే | కన్నడ | ||
2002 | మగునిరా శగడ | ఒడియా | ||
2002 | సమురాయ్ | కవిత | తమిళం | |
2002 | ఎవరే అతగాడు | స్నేహ | తెలుగు | |
2002 | తిలాదానం | |||
2002 | మగునిరా శగడ | ఒడియా | ||
2002 | ఛల్ | పద్మిని | హిందీ | |
2002 | దేశ్ దేవి | గాయత్రి | ||
2003 | ఎక్స్‌క్యూస్ మీ | మోనికా ఖురానా | ||
2003 | ఎక్స్‌క్యూస్ మీ | స్వాతి దీక్షిత్ | కన్నడ | |
2004 | హోతాత్ నీరర్ జోన్యో | రాణి | బెంగాలీ | |
2011 | కటకుటి | సుధేష్ణ | ||
2012 | క్వార్టెట్ 1 | హిందీ | ||
2014 | శృంగఖాల్ | అంబిక | అస్సామీ | ఉత్తమ నటిగా ప్రాగ్ సినీ అవార్డులు |
2015 | అర్షినగర్ | మధు మిత్ర | బెంగాలీ | |
2016 | వన్ లిటిల్ ఫింగర్ | ఆంగ్లం | ||
2018 | అలీఫా | ఫాతిమా | బెంగాలీ | |
2018 | దౌశోభుజ- ఏ దుర్గాచిత్ర | అతిధి పాత్ర |