This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
జయంతి దలాల్ | |
---|---|
![]() | |
Born | జయంతి ఘేలాభాయ్ దలాల్ 1909 నవంబరు 18 అహ్మదాబాద్ |
Died | 24 ఆగస్టు 1970 | (aged 60)
Notable awards | రంజిత్రమ్ గోల్డ్ మెడల్ |
Relatives | ఘేలాభాయ్ (తండ్రి) |
జయంతి ఘేలాభాయ్ దలాల్ ( 1909 నవంబరు 18 - 1970 ఆగస్టు 24) ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. సంఘ సంస్కర్త. గుజరాతీ రచయిత, ప్రచురణకర్త, రంగస్థల నటుడు, దర్శకుడు, రాజకీయవేత్త. థియేటర్ ఆర్గనైజర్ కుటుంబంలో జన్మించాడు. అతను సోషలిజం, గాంధేయ తత్వశాస్త్రం ద్వారా ప్రభావితమయ్యాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, తరువాత కూడా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అతను ఏకపాత్ర నాటకాలు, చిన్న కథలు.. మరి కొన్ని ప్రచురణలు చేసాడు.
జయంతి దలాల్ 1909 నవంబరు 18న అహ్మదాబాద్‌లో జన్మించారు. అతని తండ్రి ఘెలాభాయ్ 'దేశీ నాటక సమాజ్' ఆర్గనైజర్.[1][2][3] దీని కారణంగా జయంతి దలాల్ వివిధ ప్రాంతాలలో తన ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసించాల్సి వచ్చింది. అతను 1925లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, తదుపరి చదువుల కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, గుజరాత్ లో చేరాడు. అతను 1930లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేందుకు చదువును విడిచిపెట్టాడు.
అతను 1939లో పబ్లిషింగ్ హౌస్‌ను ప్రారంభించాడు. అతను 1956లో ఇందులాల్ యాగ్నిక్‌కి సహాయం చేస్తూ మహాగుజరాత్ ఉద్యమంలో పాల్గొన్నాడు. అదే సమయంలో నవగుజరాత్ దినపత్రిక ప్రచురణ ప్రారంభించాడు. అతను 1957లో బొంబాయి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 1962లో తిరిగి పోటీ చేసినా ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. అతను 1970 ఆగస్టు 24న అహ్మదాబాద్‌లో మరణించాడు.[4] అప్పటివరకు పబ్లిషింగ్ హౌస్‌ను నిర్వహించాడు. తన రాజకీయ జీవితంతో పాటు, అతను ఔత్సాహిక థియేటర్ గ్రూప్ రంగమండల్ ద్వారా నటన, దర్శకత్వం కొనసాగించాడు.[1]
అతను ఏకపాత్రాభినయాలకు ప్రసిద్ధి. అవి వినూత్నంగా, జీవితానికి సంబంధించినవి, ఆలోచనాత్మకమైన, వ్యంగ్య సంభాషణలతో నిండి ఉండేవి. అతని ప్రసిద్ధ నాటకాలలో కొన్ని సోయి ను నాకు, ద్రౌపది నో సహకార్ (1950), జీవన్‌దీప్ (1940), జోయియే ఛే, జోయియే ఛియే. జవానికా (1941), ప్రవేశ్ బిజో (1950), ప్రవేశ్ ట్రిజో (1953), ఛోతో ప్రవేశ్ (1957). రంగ్‌తోరన్ అనేది పిల్లల నాటకాల సమాహారం కాగా, అవతరన్ (1949) మూడు అంకాల నాటకం.[5] కయా లక్దానీ, మాయా లుగ్దానీ (1963) అనేది రంగస్థలంపై ఒక గ్రంథం.[6][7] అతని నాటకాలు 'జవ్నిక' (కర్టెన్, 1941), 'ప్రవేష్'. రేఖ (1939-1940), ఏకంకి (1951) పత్రికలకు సంపాదకత్వం వహించాడు. అతను మహాగుజరాత్ ఉద్యమ సమయంలో గతి వారపత్రికను, తరువాత నవగుజరాత్ (న్యూ గుజరాత్, 1956) దినపత్రికను కూడా స్థాపించాడు.[8] అతను దహ్యాభాయ్ ఝవేరి పూర్తి రచనలను ప్రచురించాడు. అలాగే అతను ఢిల్లీలో ఉన్న సినిమా మ్యాగజైన్‌కు సంపాదకత్వం వహించాడు. 1935లో గుజరాతీ చలన చిత్రం బిఖారే మోతీని కూడా నిర్మించాడు.
అతను చిన్న కథలు, నవలలు కూడా రాశాడు. ధీము అనే విభా అతని వినూత్న కథలకు ఉదాహరణ, ఇది బాహ్య ప్రపంచం కంటే ప్రధాన పాత్ర యొక్క మానసిక కోణంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. అతని కథలు జును ఛాపు (1939), అగియార్ నే పంచ్ (1944) అస్తిత్వవాదం ద్వారా ప్రభావితమయ్యాయి. పదర్ నా తీరత్ (1946) అనేది క్విట్ ఇండియా ఉద్యమంతో సహా 1942లో భారతదేశంలోని రాజకీయ వాతావరణం గురించిన రచన.[9][10][11] అద్ఖే పద్ఖే అతని చిన్న కథల సంకలనం.[12] అతను గుజరాతీలో లియో టాల్‌స్టాయ్ రాసిన వార్ అండ్ పీస్ ని అనువదించాడు.[13] ఇది అతనికి ప్రత్యేకమైన ఖ్యాతిని తెచ్చిపెట్టింది.
1959లో రంజిత్రం సువర్ణ చంద్రక్ పతకం, గుజరాతీ సాహిత్యానికి ఆయన చేసిన కృషికి గాను నర్మద్ సువర్ణ చంద్రక్ పతకం లభించాయి.
జయంతి దలాలా శతాబ్దీ-వందన (గుజరాతీలో) (2010) - సాహిత్య అకాడెమీ.
రఘువీర్ చౌదరి (1981) - జయంతి దలాల్ కుమకుమ ప్రకాశన