జననం | 1956 (age 67–68) చెన్నై, భారతదేశం |
---|---|
జాతీయత | భారతీయుడు |
రంగము | జీవశాస్త్రము |
సంస్థలు | సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ,
DNA ఫింగర్‌ప్రింటింగ్, డయాగ్నోస్టిక్స్ కోసం కేంద్రం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, మొహాలి[1] |
మాతృ సంస్థ | మద్రాసు విశ్వవిద్యాలయం, మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం |
జయరామన్ గౌరీశంకర్ (జననం 1956) భారతీయ వైద్య శాస్త్ర సూక్ష్మజీవశాస్త్రవేత్త. గౌరీశంకర్ వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నుండి తన ఎం.బి.బి.ఎస్ డిగ్రీని పొందాడు. అతను మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం నుండి బ్యాక్టీరియా జన్యుశాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ కలిగి ఉన్నాడు.
హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్త, గ్రూప్ లీడర్ గా పనిచేశారు. 2000లో అతను సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ డైరెక్టరుగా నియమించబడ్డాడు.[2] ..మొహాలిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టరుగా 2019 డిసెబరు 11 నుండి 2024 మార్చి 2 వరకు పనిచేశాడు.[3]
1991లో ఆయనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి లభించింది, ఇది జీవశాస్త్ర విభాగంలో భారతదేశంలోనే అత్యున్నత విజ్ఞాన పురస్కారం.[4] విజ్ఞాన శాస్త్ర రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2013లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేశారు.[5]