జయరామ్ పాంగి | |||
![]()
| |||
లోక్సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | గిరిధర్ గమాంగ్ | ||
---|---|---|---|
తరువాత | జినా హికాకా | ||
నియోజకవర్గం | కోరాపుట్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1977 - 1980 1990 - 1995 2000 - 2009 | |||
నియోజకవర్గం | పొట్టంగి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్, బిజూ జనతాదళ్, బీఆర్ఎస్ | ||
బంధువులు | చంద్రమా శాంత (మేనత్త) |
జయరామ్ పాంగి ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పొట్టంగి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]
జయరామ్ పాంగి 1977లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పొట్టంగి శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన 1990లో రెండోసారి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. జయరామ్ పాంగి ఆ తరువాత జనతాదళ్ పార్టీని వీడి బిజూ జనతాదళ్ పార్టీలో చేరి 2000, 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
జయరామ్ పాంగి 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కోరాపుట్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2017లో బీజేడీని వీడి బీజేపీలో చేరి[2], 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఆయన 2023 జనవరి 27న హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితిలో చేరాడు.[3]
జయరామ్ పాంగి 2 డిసెంబర్ 2023న బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4]
Ex-BJD MP Jayaram Pangi joins Congress in Odisha