జయశ్రీ రైజి | |||
![]()
| |||
పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ
| |||
పదవీ కాలం 1952-1962 | |||
నియోజకవర్గం | బొంబాయి సబర్బన్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సూరత్ | 1895 అక్టోబరు 26||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ఎన్ఎం రైజి | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు |
జయశ్రీ రైజి ( 1895 అక్టోబరు 26-1985) భారత స్వాతంత్ర్య సమరయోధురాలు. సామాజిక కార్యకర్త, సంస్కరణవాది, రాజకీయ నాయకురాలు. బొంబాయి సబర్బన్ స్థానం నుండి 1వ లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.
జయశ్రీ 1985, అక్టోబరు 26న సూరత్ లోని సర్ మనుభాయ్ మెహతాకు జన్మించింది. బరోడా కళాశాలలో ఉన్నత చదువులను చదివారు.[1]
సామాజిక సేవలో పేరొందిన రైజి 1919లో బొంబాయి ప్రెసిడెన్సీ మహిళా కౌన్సిల్ చైర్‌పర్సన్ గా ఎన్నికయింది. 1930లో సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో, విదేశీ వస్తువులను విక్రయించే దుకాణాల పికెటింగ్‌లో పాల్గొంది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ అధికారులు అరెస్టు చేసి ఆరునెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడానికి, వాటి ప్రదర్శనల కోసం మహిళా సహకార దుకాణాలను ఏర్పాటు చేయడానికి సహాయపడింది.[1]
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, బొంబాయి సబర్బన్ నియోజకవర్గం నుండి మొదటి సాధారణ ఎన్నికల్లో పోటిచేసి 1వ లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయింది.[2] చైల్డ్ వెల్ఫేర్ కోసం ఇండియన్ కౌన్సిల్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా ఉంటూ ఆ సంస్థ కార్యకలాపాలలో పాటు పంచుకుంది.[3] 1980లో మహిళలు, పిల్లల అభివృద్ధి-సంక్షేమం కొరకు జమ్నాలాల్ బజాజ్ అవార్డును అందుకుంది.[4]
జయశ్రీ రైజికి 1918తో ఎన్ఎం రైజితో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.[1]
జయశ్రీ రైజి 1985లో మరణించింది.[5]