జలగం వెంగళరావు ఉద్యానవనం | |
---|---|
జలగం వెంగళరావు ఉద్యానవనంలో చిన్నారుల ఆట స్థలం | |
రకం | ఉద్యానవనం |
స్థానం | బంజారాహిల్స్, హైదరాబాదు, తెలంగాణ |
సమీప పట్టణం | హైదరాబాదు |
అక్షాంశరేఖాంశాలు | 17°25′22″N 78°26′56″E / 17.422642°N 78.448817°E |
విస్తీర్ణం | 10 ఎకరాలు |
నిర్వహిస్తుంది | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
తెరుచు సమయం | 2002 |
జలగం వెంగళరావు ఉద్యానవనం (జెవిఆర్ పార్కు, బంజారా పార్కు) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ ఉన్న ఉద్యానవనం.[1] ఈ పార్కుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పేరు పెట్టారు.[2] ఈ పార్కు సమీపంలో హోటల్ తాజ్ కృష్ణ, జివికె వన్ షాపింగ్ మాల్ ఉన్నాయి.
అంతకుముందు ఈ ప్రాంతంలో ఏనుగుకుంట సరస్సు ఉండేది. 2020, ఆగస్టులో ప్రారంభించబడిన ఈ పార్కు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పార్కు లోపల ఒక చిన్న చెరువు ఉంది. పాదచారులు నడవడానికి చుట్టూ వాకింగ్ ట్రాక్, చిన్నారులు అడుకోవడానికి ప్రత్యేకమైన ఆట స్థలం ఉన్నాయి. ఈ పార్కు నిర్వహణను హైదరాబాదు మహానగరపాలక సంస్థ చూసుకుంటుంది. ప్రతిరోజూ ఉదయం 5.00 నుండి ఉదయం 8.00 వరకు పాదచారులకు, ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు సందర్శకులకు ఈ పార్కులో ప్రవేశం ఉంటుంది. పెద్దలకు 10 రూపాయలు, పిల్లలకు 5 రూపాయలు నామమాత్రపు ప్రవేశ రుసుము ఉంటుంది. నగరంలోని అన్ని ప్రాంతాలనుండి ఈ పార్కు వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
పార్కు ప్రధాన ద్వారంనుండి లోపలికి వెళ్ళగానే నిటారుగా ఉన్న చిన్నచిన్న ఫౌంటైన్లు కనిపిస్తాయి. విస్తారమైన మొక్కలు, చెట్లు ఉండడంతో సాయంత్రాలలో చల్లని గాలి వీస్తుంది. పావురం, చెరువులోని బాతులు సందడిగా చేస్తుంటాయి. పార్కులో ఉన్న క్యాంటీనులో చికెన్ బిర్యాని, మంచూరియన్, ఇతర ఆహార పదార్థాలు లభిస్తాయి. సినిమా షూటింగులకు, విద్యార్థుల విహారయాత్రలకు అనువైన పచ్చకబయళ్ళు కూడా ఉన్నాయి.[3]