Salvadora oleiodes | |
---|---|
![]() | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | S. oleiodes
|
Binomial name | |
Salvadora oleiodes Decne.[1]
|
జలచెట్టును తెలుగులో పెద్దపీలు అని కూడా అంటారు. ఈ చెట్టు సుమారుగా 6 నుంచి 9 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు మొదలు 2 మీటర్ల అడ్డుకొలతతో పొట్టిగా వంపు తిరిగినట్లు ఉంటుంది. శూలముల వలె గట్టిగా ఉన్న అనేక కొమ్మలు జారుతున్నట్లు ఉంటాయి. చెట్టు మొదలు బూడిద రంగులో ఉంటుంది. దీని ఆకులు నీలం ఆకుపచ్చ కలసిన రంగులో అండాకారంలో చివర ఈటె వలె సన్నగా ఉంటాయి. మరికొన్ని ఆకులు కండ రంగులో, పరిపక్వత చెందిన చెట్టు ఆకులు ముదురాకు పచ్చ రంగులో, బూడిద రంగులో ఉంటాయి. మార్చి, ఏప్రిల్ నెలలలో ఆకు పచ్చతో కూడిన తెల్లని పూత పూస్తుంది. మే, జూన్ నాటికి కాయలు పెద్దవి అవుతాయి.
Salvadora oleoides చెట్టు విత్తనాలు చిన్నవిగా, గట్టిగా, చేదుగా వుండటం వలన పైపొట్టును డికార్టికెటరు యంత్రాల ద్వారా తొలగించడం కష్టమైనపని. salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకు, మిల్చ్ పశువులకు ఎక్కువపాలు ఇచ్చుటకై దాణా గాను ఉపయోగిస్తారు. పెర్సిక (persica) విత్తనాలు తియ్యగావుండి నూనె శాతాన్ని కూడా 39% వరకు కలిగివుండును. ఒలియొడెస్ (oleodes) గింజలు చేదుగా వుండును. గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును. కాయ\పండులో గింజ శాతం 44-46% వరకుండును. గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును. S.persica గింజలను డికార్టికేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు. S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్ చేయుదురు. ఏడాదికి 50 వేల టన్నుల గింజలను సేకరించి, క్రషింగ్ చేయు అవకాశం ఉంది. ఇంచుమించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.