జస్వంత్ సింగ్ కన్వాల్ పంజాబ్ కు చెందిన ప్రముఖ రచయిత. ఇతను వ్రాసిన రచనలలో అన్నిటికంటే మఖ్యమైనది "Dawn of the Blood" (రక్త ప్రవాహపు మొదలు). ఇది పంజాబ్ లో నక్సలైట్ ఉద్యమం పై వ్రాసిన అత్యంత వివాదాస్పదమైన నవల. ఆ నవల మొదట పంజాబి భాషలో వ్రాసి తరువాత ఇంగ్లీష్ లో అనువదించడం జరిగింది. ఇతను ఎమర్జెన్సీ కాలంలో ఆ నవల వ్రాయడం, అప్పట్లో విప్లవ సాహిత్యం పైన నిషేధం ఉండడం వల్ల ఆ నవలని ప్రచురించడానికి పబ్లిషర్లు ఎవరూ ముందుకు రాలేదు. జస్వంత్ సింగ్ సింగపూర్ వెళ్ళి అక్కడ నుంచి పంజాబ్ కు ఆ నవల కాపీలు పంపించే వారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత ఇండియాకు వచ్చి సంత్ సింగ్ షెఖోన్ సహాయంతో ఆ నవలని ఇంగ్లిష్ లోకి అనువదించారు. ఆ నవల పంజాబ్ లో 1967-1972 మధ్యకాలంలో కార్మిక-రైతాంగ సాయుధ పోరాటాలు ఎలా మొదలయ్యాయో చూపిస్తుంది. 1972లో భారత కమ్యూనిస్ట్ పార్టీ - మార్కిస్ట్-లెనినిస్ట్ నాయకుడు చారు మజుందార్ చనిపోయిన తరువాత మార్కిస్ట్-లెనినిస్ట్ పార్టీ అనేక పార్టీలుగా చీలిపోయింది. ఈ నవల వ్రాసిన తరువాతి కాలంలో (1980 తరువాత) కమ్యూనిస్ట్ వ్యతిరేక స్వభావం కలిగిన ఖలిస్తాన్ ఉద్యమం బలపడింది. వారు పంజాబ్ ని సిక్కు ఛాందసవాద రాజ్యంగా స్థాపించాలనే కోరికతో తమ సిధ్ధాంతాలని వ్యతిరేకించిన మార్క్సిస్ట్-లెనినిస్ట్ విప్లవకారులని కూడా హత్యలు చేశారు. ఆ సమయంలో అనేక మంది మార్కిస్ట్-లెనినిస్ట్ విప్లవకారుల్ని పోలీసులు కూడా జైళ్ళలో చిత్ర హింసలు పెట్టి చంపారు. 1990 తరువాత చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మార్కిస్ట్-లెనినిస్ట్ విప్లవకారులు పంజాబ్లో మిగిలారు. కానీ "Dawn of the Blood" నేటికీ పంజాబ్ లో మార్కిస్ట్-లెనినిస్ట్ పోరాటం యొక్క ప్రభావాన్ని గుర్తు చేస్తోంది.
జస్వంత్ సింగ్ కన్వాల్ పంజాబ్ లోని మోగా జిల్లా ధుదికే గ్రామంలో జన్మించారు. ఇతను మొదట్లో రొమాంటిక్ కథలు, నవలలు వ్రాసేవారు. మార్క్సిజం చదివిన తరువాత విప్లవ కథలు, నవలలు వ్రాయడం మొదలు పెట్టారు. ఇతను పంజాబ్ లో అనేక ప్రాంతాలు తిరిగి అక్కడ ప్రజలు పడతున్న కష్టాల గురించి తెలుసుకున్నారు.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)