జస్సా సింగ్ రాంఘఢియా (1723–1803) సిక్ఖు సమాఖ్య కాలానికి చెందిన సుప్రసిద్ధ సిక్ఖు నాయకుడు. ఆయన రాంఘఢియా మిసల్ (లేక సమాఖ్య)కు సైన్యాధ్యక్షుడు. ఆయన జీవిత విశేషాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
జస్సా సింగ్ రాంఘఢియా 1723లో జన్మించారు. డబ్ల్యు. హెచ్. మెక్ లియాడ్ ప్రకారం,[1] ఆయన జన్మ ప్రదేశం లాహోర్ సమీపంలోని ఇకోగిల్ గ్రామం, హెచ్. ఎస్. సింఘా ప్రకారం[2] లాహోర్ నగరంలోనే పుట్టారు, పూర్ణిమా ధవన్[3] ఆయన జన్మ ప్రదేశం అమృత్ సర్ సమీపంలోని గుగా లేక సుర్ సింగ్ లో పుట్టారు. ఆయన తర్ఖాన్ ప్రాంతానికి చెందినవారనీ, మొదట్లో జస్సా సింగ్ తొకార్ అన్న పేరు ఉండేదని చారిత్రికుల్లో ఏకీభావం ఉంది.[1] ఆయనకు జై సింగ్, కుషాల్ సింగ్, మాలి సింగ్, తారా సింగ్ అన్న నలుగురు సోదరులు ఉన్నట్టు, ఆయన తండ్రి జ్ఞాని భగవాన్ సింగ్ మరణించాకా కుటుంబ బాధ్యతలు స్వీకరించినట్టు రాశారు.[4][page needed]