జహీరా |
---|
1968లో స్విట్జర్లాండ్ లో ఆన్ హర్ మెజెస్టి సీక్రెట్ సర్వీస్ చిత్రీకరణలో జహీరా |
వృత్తి | సినిమా నటి |
---|
జహీరా ఒక భారతీయ సినిమా నటి.
1969లో ఆన్ హర్ మెజెస్టి సీక్రెట్ సర్వీస్ అనే జేమ్స్ బాండ్ సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. 1970లలో హిందీ సినిమాల్లో నటించింది. 1974లో వచ్చిన కాల్ గర్ల్ అనే సినిమాలో తొలిసారిగా ప్రధాన పాత్రలో కనిపించింది.[1] ఆ తరువాత ఆద్మీ సడక్ కా, నౌక్రి మొదలైన సినిమాల్లో కూడా నటించింది. దేవ్ ఆనంద్, శతృఘ్న సిన్హా, జహీదా, జీవన్‌లతో నటించిన గ్యాంబ్లర్ సినిమా విజయవంతం అయింది. జహీరా కొన్ని పంజాబీ సినిమాల్లో కూడా నటించింది. తన పేరును జహెరా అని రాసుకునేది.[2]
- ఆన్ హర్ మెజెస్టి సీక్రెట్ సర్వీస్ (1969): జారా
- ది గ్యాంబ్లర్ (1971) (జహీరాగా): జూలీ
- అనోఖా దాన్ (1972)
- అంజాన్ రాహెన్ (1974): సునీత
- అలింగన్ (1974)
- కాల్ గర్ల్ (1974): మాయ/కామిని
- తూఫాన్ ఔర్ బిజిలీ (1975): మాధురి/షీలా
- జిందా దిల్ (1975): రేఖ
- మేరే సర్తాజ్ (1975): పర్వీన్ J. గుల్రేజ్
- ఏక్ హన్స్ కా జోడా (1975): టీనా
- ధర్మాత్మ (1975) (జహిర్రాగా)
- హర్ఫాన్ మౌలా (1976) (జహెర్రాగా): ఖవాలీ అనౌన్సర్
- టాక్సీ టాక్సీ (1977): జ్యోతి శర్మ
- సాల్ సోల్వన్ చద్య (1977): బబ్లీ
- ఆద్మీ సడక్ కా (1977) (జహెర్రాగా): వందనా టాండన్
- కాలా ఆద్మీ (1978)
- ఆహుతి (1978): కుసుమ్
- నౌక్రి (1978): రామోలా
- ఖుదా కసం (1981) (జహీరాగా): లతిక
- షక్కా (1981) (జహెర్రాగా): మీనా
- దో ఖిలాడి (1976)