జహ్రా అలీ యావర్ జంగ్ | |
---|---|
![]() కైరోలో భారత రాయబారి అలీ యావర్ జంగ్ కోసం విందు ఏర్పాటు చేసిన అబ్దెల్ నాజర్ | |
జననం | |
వృత్తి | సామాజిక కార్యకర్త |
వీటికి ప్రసిద్ధి | సామాజిక సేవ |
జీవిత భాగస్వామి | అలీ యావర్ జంగ్ |
పిల్లలు | బిల్కీస్ లతీఫ్ (కుమార్తె) |
బంధువులు | ఐ.హెచ్.లతీఫ్ (అల్లుడు) |
పురస్కారాలు | పద్మభూషణ్ |
బేగం జహ్రా అలీ యావర్ జంగ్ హైదరాబాదుకు చెందిన సంఘసేవకురాలు, పద్మభూషణ పురస్కార గ్రహీత.
జహ్రా, హైదరాబాదులో 1920, డిసెంబరు 27వ తేదీన నవాబ్ మెహదీ యార్ జంగ్ బహదూర్, కుల్సుం షంసున్నీసా బేగం దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి ఆ తర్వాత కాలంలో హైదరాబాదు రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు.
ఈమె విద్యాభ్యాసం ఇంగ్లాండులోని హారోలోని సౌత్‌లాండ్‌లో సాగింది.[1]
ఈమె భర్త నవాబ్ అలీ యావర్ జంగ్, [2] అర్జెంటీనా, ఈజిప్టు, యుగోస్లావియా, గ్రీకు, ఫ్రాన్స్, అమెరికా దేశాలకు భారత రాయబారిగా పనిచేశాడు. మహారాష్ట్ర గవర్నరుగాను, [3] ఉస్మానియా విశ్వవిద్యాలయం, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా కూడా పనిచేశాడు.
ఈమె చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1976లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.[4]
ఈమె 2010లో ఫిబ్రవరి 19న హైదరాబాదులో మరణించింది.