జాంబియా మహిళా క్రికెట్ జట్టు జాంబియా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు.
2018 ఏప్రిల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన సభ్యులందరికీ పూర్తి స్థాయి మహిళా ట్వంటీ20 అంతర్జాతీయ (డబ్ల్యూటీ20ఐ) హోదాను మంజూరు చేసింది. అందువలన 2018 జూలై 1 తర్వాత జాంబియా మహిళా క్రికెటర్లు ఇతర అంతర్జాతీయ జట్టు మధ్య జరిగిన అన్ని ట్వంటీ20 మ్యాచ్ లు టి20ఐ హోదాను కలిగి ఉంటాయి.[1]
2018 ఆగస్టులో జాంబియా బోట్స్వాన 7 టోర్నమెంట్లో భాగంగా ఉంది. అయితే బోట్స్వాన క్రీడాకారిణులు జట్టులో ఉండడము వలన లెసోతో, మలావి, మొజాంబిక్, నమీబియా, సియెర్రా లియోన్ జట్లతో జరిగిన జాంబియా మ్యాచ్ లను డబ్ల్యూటీ20ఐలుగా పరిగణించలేదు.[2][3]
సాధారణ పోటీ సామర్థ్యం, ఆమోదయోగ్యమైన పాలన వ్యవస్థకు సంబంధించిన ఐసీసీ సభ్యత్వ ప్రమాణాలను చాలాసార్లు పాటించకపోవడం వల్ల 2019లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జాంబియా సభ్యత్వాన్ని నిరోధించింది. ఇంకా జాంబియా ఐసీసీ నియమాలను అనుసరించడములో విఫలమవడంతో వారి సభ్యత్వాన్ని 2021లో రద్దు చేశారు.