జాక్ ఎడ్వర్డ్స్

జాక్ ఎడ్వర్డ్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గ్రాహం నీల్ ఎడ్వర్డ్స్
పుట్టిన తేదీ(1955-05-27)1955 మే 27
నెల్సన్, న్యూజీలాండ్
మరణించిన తేదీ2020 ఏప్రిల్ 6(2020-04-06) (వయసు 64)
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపర్-బ్యాట్స్‌మన్
బంధువులుజో ఎడ్వర్డ్స్ (కోడలు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 139)1977 ఫిబ్రవరి 18 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1981 మార్చి 13 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 22)1976 ఫిబ్రవరి 21 - ఇండియా తో
చివరి వన్‌డే1981 ఫిబ్రవరి 15 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1973–74 to 1984–85Central Districts
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 8 6 92 31
చేసిన పరుగులు 377 138 4,589 588
బ్యాటింగు సగటు 25.13 23.00 29.41 20.27
100లు/50లు 0/3 0/0 5/25 0/0
అత్యుత్తమ స్కోరు 55 41 177* 49
వేసిన బంతులు 6 71 6
వికెట్లు 1 0 1
బౌలింగు సగటు 5.00 5.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a 0 0
అత్యుత్తమ బౌలింగు 1/5 1/5
క్యాచ్‌లు/స్టంపింగులు 7/- 5/- 126/16 19/0
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 4

గ్రాహం నీల్ ఎడ్వర్డ్స్ (1955, మే 27 - 2020, ఏప్రిల్ 6)[1] న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. న్యూజీలాండ్ తరపున ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు, ఆరు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.

జననం, విద్య

[మార్చు]

ఎడ్వర్డ్స్ 1955, మే 27 న్యూజీలాండ్ లోని నెల్సన్‌లో జన్మించాడు. నెల్సన్ కళాశాలలో చదివాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

బలిష్టమైన వికెట్ కీపర్ గా రాణించాడు. 1976-77లో స్పెషలిస్ట్‌గా ఆస్ట్రేలియాపై తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. 1977-78లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా వచ్చాడు. ఆక్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై 55 పరుగులు, 54 పరుగులు చేశాడు. దాంతో 1978లో ఇంగ్లాండ్ టూర్‌కు ఎంపికయ్యాడు. అక్కడ అతను అంతగా రాణించలేదు.[3] 1980-81లో భారతదేశానికి వ్యతిరేకంగా మూడు స్వదేశీ టెస్ట్‌లు ఆడి, మంచి పరుగులు చూశాడు.

ఎడ్వర్డ్స్ 1973-74 నుండి 1984-85 వరకు సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల కొరకు ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ క్రికెట్ ఆడాడు. 1980-81లో వెల్లింగ్టన్‌పై 177 నాటౌట్ అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరు. ఇది ఇతని అత్యంత విజయవంతమైన సిరీస్, 47.76 సగటుతో 812 పరుగులు చేశాడు.[4] చాలా సంవత్సరాలు నెల్సన్ కోసం హాక్ కప్‌లో ప్రముఖ ఆటగాడు. నార్త్ కాంటర్‌బరీపై అతని చివరి మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు, 29 ఫోర్లతో సహా 236 పరుగులు చేశాడు.[5]

క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత ముర్చిసన్‌లో పబ్‌ను నడిపాడు. ఆపై పోర్ట్ నెల్సన్‌లో గేట్ కీపర్‌గా పనిచేశాడు. 2007లో ట్రిపుల్ బైపాస్ కోసం శస్త్రచికిత్స చేయించుకునేముందు అతనికి అనేకసార్లు చిన్నచిన్న గుండెపోటులు వచ్చాయి.

మరణం

[మార్చు]

ఎడ్వర్డ్స్ 2020, ఏప్రిల్ 6న మరణించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "One of New Zealand cricket's first big-hitting batsmen has died". NZCity. 6 April 2020. Retrieved 6 April 2020.
  2. Nelson College Old Boys' Register, 1856–2006, 6th edition
  3. Lewis, Paul. "Keeper decision is Wright". The New Zealand Herald. Retrieved 19 October 2015.
  4. "Central Districts v Wellington 1980–81". CricketArchive. Retrieved 8 April 2020.
  5. Pine, Jason (7 April 2020). "Remembering Nelson cricket legend Jock Edwards". The New Zealand Herald. Retrieved 8 April 2020.
  6. Millmow, Jonathan (7 December 2013). "Edwards has problems but few regrets". Stuff. Retrieved 8 April 2020.

బాహ్య లింకులు

[మార్చు]