జాగో | |
---|---|
దర్శకత్వం | మోహన్ రాజా |
రచన | మోహన్ రాజా ఎన్. బాస్కరన్ |
స్క్రీన్ ప్లే | మోహన్ రాజా |
కథ | మోహన్ రాజా |
నిర్మాత | ఆర్. డి. రాజా |
తారాగణం | శివ కార్తీకేయన్ ఫహద్ ఫాసిల్ నయనతార స్నేహ ప్రకాష్ రాజ్ |
ఛాయాగ్రహణం | రామ్‌జీ |
కూర్పు | ఆంథోనీ ఎల్. రూబెన్ |
సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
నిర్మాణ సంస్థ | ఆర్.డి.రాజా |
పంపిణీదార్లు | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 22 డిసెంబరు 2017(India) |
సినిమా నిడివి | 160 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹35 crore[1] |
బాక్సాఫీసు | ₹51 crore[2] |
జాగో 2017 లో విడుదల అయిన తెలుగు సినిమా. 24AM స్టూడియోస్ బ్యానర్ పై ఆర్.డి. రాజు నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ రాజా[3] దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శివ కార్తికేయన్, నయన తార నటించారు. ఇది తమిళ సినిమా "వేలైక్కారన్" కి అనువాదం.
ఒక మురికివాడ నుండి వచ్చిన జ్ఞానం రేడియో ఛానెల్‌ని ప్రారంభిచాలనుకుంటాడు. కానీ అతను తన కుటుంబం ఆర్థికంగా బాగుండడం కోసం మొదట ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటాడు. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు. అతనికి ఒక సేల్స్ మెన్ ఉద్యోగం వస్తుంది. కానీ అతను పనిచేస్తున్న పరిశ్రమలో కల్తీ జరుగుతుంది అని తెలుసుకుంటాడు. జ్ఞానం ఫుడ్ కార్పొరేషన్‌ల వెనుక ఉన్న రహస్యాన్ని ఎలా బయటపెట్టాడన్నది మిగతా కథ.