Established | 25 ఫిబ్రవరి 2019 |
---|---|
Location | ఇండియా గేట్ వృత్తం, న్యూ ఢిల్లీ, భారత దేశం |
Coordinates | 28°36′46″N 77°13′59″E / 28.612772°N 77.233053°E |
Type | Memorial |
Architect | Yogesh Chandrahasan, WeBe Design Lab, Chennai |
Website | Official government website of the National War Memorial |
జాతీయ యుద్ధ స్మారకం (ఆంగ్లం: National War Memorial (India)) భారత రక్షణ దళాలకు గౌరవ సూచికగా భారత ప్రభుత్వము చే న్యూ ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద నలభై ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఒక కట్టడం. భారత పాక్ యుద్ధం 1947, గోవా విలీనం, భారత్ చైనా యుద్ధం 1962, భారత పాక్ యుద్ధం 1965, భారత పాక్ యుద్ధం 1971, కార్గిల్ యుద్ధం వంటి అనేక పోరాటాలలో అమరులైన రక్షణ దళాలకు చెందిన వీరుల పేర్లను ఈ స్మారకం యొక్క గోడలపై చెక్కబడినవి.
స్మారకాన్ని ఎలా నిర్మించాలి అనే దానిపై ప్రపంచవ్యాప్త పోటీలు జరిగాయి. ఈ పోటీలో చెన్నై కి చెందిన WeBe అనే డిజైన్ సంస్థ విజేతగా నిలిచింది. ఈ సంస్థకు చెందిన చీఫ్ ఆర్కిటెక్ట్ యోగేష్ చంద్రహాసన్, "ఈ డిజైన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం - స్మారకం వీరుల మరణాన్ని తలచుకొని శోకించే స్థలంగా కాకుండా వారి జీవితాలను, పండుగగా జరుపుకోవటం, వారిచే చేయబడ్డ త్యాగాలను గౌరవించటం." - అని తెలిపారు.
50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతిలోని జనవరి 21, 2022న కొంత భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉండే జ్యోతితో ఎయిర్ మార్షల్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతి బలభద్ర రాధాకృష్ణ విలీనం చేసారు.[1][2]
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)