National Highway 10 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 174 కి.మీ. (108 మై.) NHIDCL కింద 28 కి.మీ. | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
దక్షిణ చివర | సిలిగురి, పశ్చిమ బెంగాల్ | |||
ఉత్తర చివర | గాంగ్‌టక్, సిక్కిం | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | పశ్చిమ బెంగాల్, సిక్కిం | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 10 (ఎన్‌హెచ్10) ఈశాన్య భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది భారత బంగ్లాదేశ్ సరిహద్దును సిలిగురి మీదుగా గాంగ్‌టక్‌కు కలుపుతుంది. ఇది పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల గుండా వెళుతుంది. ఈ రహదారిని సిక్కిం రాష్ట్రంలోని రంగ్‌పో నుండి రాణిపూల్ (28 కి.మీ) వరకు నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) నిర్వహిస్తోంది.[1][2] ఈ రహదారి లోని చాలా భాగం గతంలో ఎన్‌హెచ్31A గా ఉండేది.
NH10 భారత బంగ్లాదేశ్ సరిహద్దు నుండి ఫుల్బరి, సిలిగురి, సేవోక్, కలిజోరా, రాంబి బజార్, తీస్తా బజార్, కాలింపాంగ్, పశ్చిమ బెంగాల్‌లోని మెల్లి, రంగ్‌పో, మజితార్, సింగ్‌టామ్, రాణిపూల్ గుండా వెళ్ళి సిక్కిమ్ రాష్ట్రం లోని గ్యాంగ్‌టక్ వద్ద ముగుస్తుంది. NHIDCL నిర్మించిన అటల్ సేతు వంతెన, జాతీయ రహదారి 10లో భాగం. సిక్కింలో అత్యంత పొడవైన రహదారి వంతెన కూడా. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్ జిల్లా, సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాల సరిహద్దులో రంగ్‌పో పట్టణంలో ఉంది.[3][4]