National Highway 12 | ||||
---|---|---|---|---|
![]() NH 12 at Barasat | ||||
మార్గ సమాచారం | ||||
Part of ![]() ![]() | ||||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | Dalkhola | |||
జాబితా
| ||||
వరకు | Bakkhali | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | West Bengal : 612 కిలోమీటర్లు (380 మై.) | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 12 (ఎన్‌హెచ్ 12), భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది పూర్తిగా పశ్చిమ బెంగాల్‌లో నడుస్తుంది. ఇది దాల్‌ఖోలా వద్ద ఎన్‌హెచ్ 27 కూడలి వద్ద మొదలై, బక్కాలి వద్ద ముగిస్తుంది.[1] గతంలో దీన్ని ఎన్‌హెచ్ 34 అనేవారు.
ఎన్‌హెచ్ 12 ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని దల్‌ఖోలా వద్ద ఎన్‌హెచ్ 27 కూడలి నుండి మొదలై, కరండిఘి, మహారాజహత్ రాయ్‌గంజ్, గజోల్, మాల్దా గుండా వెళుతుంది, ఫరక్కా బ్యారేజ్, ఉమర్‌పూర్, ఔరంగాబాద్, పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్, బహరంపూర్, రణపూర్, బెతు బెల్దంగా, కృష్ణనగర్, బెల్దంగా, బెల్దంగా, బరాసత్, బెల్ఘరియా ఎక్స్‌ప్రెస్ వే, దంకుని, సంత్రాగచి, బెహలా, జోకా, అమ్తాలా, డైమండ్ హార్బర్, కక్ద్విప్ ల గుండా వెళ్తుంది.
2020 లో జగులియా నుండి నదియాలోని కృష్ణానగర్ వరకు ఉన్న 66 కిలోమీటర్లు (41 మై.) భాగాన్ని వెడల్పు చెయ్యడం ప్రారంభమైంది. [2] 2021 నుండి, బహరంపూర్ టౌన్ బైపాస్ చేయడానికి బహరంపూర్ బైపాస్ నిర్మాణం, రాణాఘాట్ వద్ద రోడ్ ఓవర్‌బ్రిడ్జ్, కృష్ణానగర్ వద్ద జలంగి నదిపైన, రాణాఘాట్ వద్ద చుర్ని నదిపైనా వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బర్జాగులి వద్ద కల్యాణి ఎక్స్‌ప్రెస్‌వే లింక్ నిర్మాణంతో పాటు శాంతిపూర్ బైపాస్ పనులు కొనసాగుతున్నాయి. కల్యాణి, న్యూ ఈశ్వర్ గుప్తా వంతెన, మగ్రా, బైద్యబతి, సెరంపూర్ (శ్రీరాంపూర్) & ఉత్తరపారా మీదుగా బర్జాగులి వద్ద ఉన్న ఎన్‌హెచ్ 12తో దంకుని వద్ద ఎన్‌హెచ్ 19ని లింక్ చేయాలని ప్లాన్ చేసారు. తద్వారా ఎన్‌హెచ్ 16, ఎన్‌హెచ్ 49 నుండి ఉత్తర పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే ట్రక్కులు కోల్‌కతాను, బరాసత్ & జెస్సోర్ లను దాటవేయవచ్చు. దీంతో ఎన్‌హెచ్ 12పై ఒత్తిడి తగ్గుతుంది. బెల్గోరియా ఎక్స్‌ప్రెస్‌వే నుండి కళ్యాణి ఎక్స్‌ప్రెస్‌వే పునర్నిర్మాణం కూడా ఎన్‌హెచ్ 12 పునరాభివృద్ధి పథకం కింద అమలు చేయబడుతోంది.
2021 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం, ఆ ఏడు ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలకు హైవే ప్రాజెక్టులను కేటాయించింది, వీటిలో ₹25,000 crore (US$3.1 billion) ఈ రహదారి లోని 612 కిలోమీటర్లు (380 మై.) అభివృద్ధికి కేటాయించింది.[3]
ఎన్‌హెచ్ 12 మొత్తం పశ్చిమ బెంగాల్‌లో ఉంది. బక్కలి నుండి దల్ఖోలా వరకు అన్ని టోల్ ప్లాజాల (జిల్లాల వారీగా) జాబితా క్రింద ఉంది. [4]
ఈ రహదారిలో బరసాత్ నుండి బెల్గోరియా వరకు ఉన్న భాగం, AH1 (ఆసియన్ హైవే 1) నెట్‌వర్క్‌లో భాగం. ఇది జపాన్‌లోని టోక్యో నుండి ప్రారంభమై టర్కీలోని ఇస్తాంబుల్‌లో ముగుస్తుంది.