National Highway 13 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 1,559 కి.మీ. (969 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
West చివర | తవాంగ్ | |||
తూర్పు చివర | వక్రో, లోహిత్ జిల్లా | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | అరుణాచల్ ప్రదేశ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 13 (ఎన్హెచ్ 13), అరుణాచల్ వ్యాప్త హైవే నెట్వర్క్లో భాగం. 1,559 కి.మీ. పొడవున్న రెండు వరుసల ఈ జాతీయ రహదారి, వాయువ్యంలో తవాంగ్ నుండి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ అంతా తిరిగి, ఆగ్నేయంలో వక్రో వరకు వెళ్తుంది.[1][2] 2018 లో 6.2 కి.మీ. పొడవున్న దిబాంగ్ నది వంతెన పూర్తవడంతో, మొత్తం రహదారి అంతా వినియోగం లోకి వచ్చింది.[3][4] 2024 మార్చిలో సెలా సొరంగం వినియోగం లోకి రావడంతో ఏడాది పొడవునా రవాణా సౌకర్యం ఏర్పడింది.[5] హైవేల పునర్వ్యవస్థీకరణకు ముందు, దీనిని ఎన్హెచ్ 229, ఎన్హెచ్52 అనేవారు.[6] వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ రహదారి, భారతదేశపు తూర్పు సెక్టారుకు ఎదురుగా వాస్తవాధీన రేఖకు అవతల ఉన్న చైనా వెస్ట్రన్ థియేటర్ కమాండ్ నుండి ఉన్న ముప్పును ఎదుర్కోవడంలో భారత సైనిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.
ఎన్హెచ్13 తవాంగ్, బోమ్డిలా, నెచిపు, సెప్పా, సగాలీ, జిరో, దపోరిజో, అలోంగ్, పాసిఘాట్, తేజులను కలుపుతూ అరుణాచల్ ప్రదేశ్ లోని వక్రో సమీపంలో ఎన్హెచ్-15తో కలిసి ముగుస్తుంది.[6][7]
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) Start and end points of National Highways-Source-Government of India