National Highway 134 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 34 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 95 కి.మీ. (59 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
దక్షిణ చివర | ధరసు | |||
ఉత్తర చివర | యమునోత్రి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఉత్తరాఖండ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 134 (ఎన్‌హెచ్ 134) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది జాతీయ రహదారి 34 కు చెందిన శాఖా మార్గం. ఎన్‌హెచ్-134 ఉత్తరాఖండ్ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది.[1][2][3]
ధరసు - కుత్నౌర్ - యమునోత్రి[1]
ఎన్‌హెచ్ 34 ధరసు వద్ద ముగింపు.[1]
2018 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా బెండ్ - బార్కోట్ టన్నెల్‌కు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సొరంగం 4.531 కిలోమీటర్లు (2.815 మై.) పొడవు, రెండు లేన్లు, తప్పించుకునే మార్గాలతో ఈ సొరంగాన్ని నిర్మిస్తారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 1383.78 కోట్లు కాగా సొరంగం ప్రాజెక్టుకు రూ. 1119.69 కోట్లు. ఈ సొరంగం, ధరసు నుండి యమునోత్రికి ప్రయాణ దూరాన్ని దాదాపు 20 కిలోమీటర్లు (12 మై.) తగ్గిస్తుంది. ప్రయాణ సమయం సుమారు ఒక గంట. దీని వలన సకల వాతావరణ రవాణా సౌకర్యం కలుగుతుంది.[4][5]
2023 నవంబరు 12 న, నిర్మాణంలో ఉండగా సొరంగంలోని ఒక భాగం కూలిపోయి, 41 మంది సొరంగం కార్మికులు చిక్కుకుపోయారు.[6][7] రెస్క్యూ కార్యకలాపాలు వెంటనే ప్రారంభించారు. 16 రోజుల తర్వాత నవంబరు 28 న కార్మికులను కాపాడారు.[8] [9]
<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు