National Highway 275 | ||||
---|---|---|---|---|
ఎరుపు రంగులో జాతీయ రహదారి 275 | ||||
మార్గ సమాచారం | ||||
పొడవు | 367 kమీ. (228 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
తూర్పు చివర | బెంగళూరు | |||
జాబితా
| ||||
పశ్చిమ చివర | బంట్వాల్, కర్ణాటక | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | కర్ణాటక | |||
Major cities | బెంగళూరు, కెంగేరి, బిడడి, రామనగర, చన్నపట్నం, మద్దూరు, మాండ్య, శ్రీరంగపట్టణ, మైసూరు, హున్సూర్, పెరియపట్న, బైలకుప్పే, కుశలనగర్, మడికేరి, సుల్లియా, పుత్తూరు, బంట్వాల్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 275 (ఎన్‌హెచ్-275), బెంగళూరు-మంగళూరు ఎకనామిక్ కారిడార్ (EC-34) లో భాగం.[1] దీన్ని దీన్ని బెంగళూరు-మైసూరు యాక్సెస్-నియంత్రిత ఎక్స్‌ప్రెస్‌వే అని కూడా అంటారు. బెంగళూరు నుండి ప్రారంభమై మైసూరుకు 119 kమీ. (390,000 అ.) మార్గం 6-వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగాను, మైసూరు నుండి బిలికెరె (మడికేరి వైపు) వరకు 4-వరుసల దారి గానూ వెళ్ళిబంట్వాళ వద్ద ముగుస్తుంది.[2] ఈ రహదారి తీరప్రాంత నగరమైన మంగళూరును బెంగళూరుకు కలుపుతుంది. ఇది జాతీయ రహదారి 75 (ఎన్‌హెచ్-75)కి బైపాస్ మార్గం కూడా. ఈ హైవేలోని బెంగళూరు నుండి మైసూరు వరకు ఉన్న భాగం 4 నుండి 10 వరుసలలకు అప్‌గ్రేడ్ చేసారు, ఇందులో 6-వరుసల విభాగం ఎలివేటెడ్ యాక్సెస్-నియంత్రిత క్యారేజ్‌వే కాగా, దీనికి రెండు వైపులా ఉన్న 2-వరుసల విభాగం, సర్వీస్ రోడ్లు. బెంగళూరు, మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని 3 గంటల నుండి 75 నిమిషాలకు తగ్గినట్లు పేర్కొంది. [3]
హైవే నంబర్ | మూలం | గమ్యం | ద్వారా | పొడవు (కిమీ) |
---|---|---|---|---|
275 | బంట్వాల్ | బెంగళూరు | మైసూరు | 367 |
బెంగళూరు-మైసూరు యాక్సెస్-నియంత్రిత ఎక్స్‌ప్రెస్ వే 119 kమీ. (390,000 అ.) పొడవు, 10 లేన్లు, సుంకం వసూలు చేసే ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే. దీన్ని రెండు దశల్లో, ₹8,000 కోట్ల వ్యయంతో నిర్మించారు.[4] 56 kమీ. (184,000 అ.) లో మొదటి దశలో బెంగళూరు, నిడఘట్టలను కలపగా, 61 kమీ. (200,000 అ.) ల రెండవ దశలో నిడఘట్టను మైసూరును కలిపారు. ఈ 2018 ప్రాజెక్టుకు మార్చిలో శంకుస్థాపన చేశారు.[5]