National Highway 40 | ||||
---|---|---|---|---|
Map of the National Highway in red | ||||
మార్గ సమాచారం | ||||
పొడవు | 408 కి.మీ. (254 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తరం చివర | కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్ | |||
జాబితా
| ||||
దక్షిణం చివర | రాణీపేట రోడ్డు, తమిళనాడు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్: 381 కి.మీ. (237 మై.) తమిళనాడు: 27 కి.మీ. (17 మై.) | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | కర్నూలు - నంద్యాల - కడప - పీలేరు - చిత్తూరు | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 40 (ఎన్‌హెచ్ 40) (పాత సంఖ్య: జాతీయ రహదారి 4, 18) భారతదేశంలోని ప్రధానమైన జాతీయ రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, తమిళనాడు రాష్ట్రంలో రాణిపేట రోడ్డుని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 4, 18 నుండి 40 గా మార్చబడింది.[2]
ఇది కర్నూలులో జాతీయ రహదారి 44 జంక్షన్ వద్ద ప్రారంభమై కడప, చిత్తూరు మీదుగా వెళ్లి తమిళనాడులోని రాణిపేటలో ముగుస్తుంది.[3][4] దీనిని రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవే అంటారు. రహదారి లోని కర్నూలు-కడప భాగాన్ని నాలుగు వరుసలకు ఉన్నతీకరించారు.
ఈ రహదారి కర్నూలు నుండి మొదలై ఓర్వకల్లు, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దువ్వూరు, మైదుకూరు, చెన్నూరు, కడప, మద్దిమడుగు, గువ్వలచెరువు, రాయచోటి, కలకడ, మహల్, పీలేరు, కల్లూరు, దామల్ చెరువు, పూతలపట్టు ద్వారా ప్రయాణించి చిత్తూరు చేరుతుంది.
ఇది కర్నూలులో మొదలై నంద్యాల, ఆళ్లగడ్డ, మైదుకూరు, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా వెళ్ళి తమిళనాడు లోని రాణిపేటలో ముగుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో 381.00 కి.మీ. (236.74 మై.), తమిళనాడులో 27.00 కి.మీ. (16.78 మై.) నిడివి ఉంటుంది.[5][6]
కర్నూలు - నంద్యాల - ఆళ్లగడ్డ - మైదుకూరు - కడప - రాయచోటి - పీలేరు - చిత్తూరు - రాణిపేట