National Highway 49 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH46 | ||||
పొడవు | 668 కి.మీ. (415 మై.) భారతమాల: 350 కి.మీ. (220 మై.) (దేవ్‌గఢ్ - ఖరగ్‌పూర్) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | బిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్ | |||
తూర్పు చివర | ఖరగ్‌పూర్, పశ్చిమ బెంగాల్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 49 ( పాత ఎన్‌హెచ్ 6, పాత ఎన్‌హెచ్ 200 లు కలిసి) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి.[1] దీని పొడవు 668 కి.మీ. (415 మై.).[2] ఈ రహదారి చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుండి పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ వరకు వెళుతుంది. ఇది బిలాస్‌పూర్ సమీపంలో ఎన్‌హెచ్ 130 వద్ద మొదలై, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ సమీపంలోని ఎన్‌హెచ్ 16 వద్ద ముగుస్తుంది. భారతదేశంలోని AH46 నెట్‌వర్క్‌లో ఇది ఒక భాగం.
ఎన్‌హెచ్49 ఛత్తీష్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నాలుగు రాష్ట్రాల గుండా వెళ్తుంది.[3]
బిలాస్‌పూర్, సరాగావ్, శక్తి, రాయ్‌గఢ్
కనక్‌తోరా, ఝార్సుగూడా, కుచిందా, ప్రవాసుని, దేవ్‌ఘర్, బరాకోట్, పాల్ లహర్హా, కెందుఝర్‌ఘర్, తురుముంగ, చధైబోల్, జాషిపూర్, బంగ్రిపోషి