National Highway 7 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 845 కి.మీ. (525 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | ఫాజిల్కా | |||
తూర్పు చివర | మానా కనుమ, ఉత్తరాఖండ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | ఫాజిల్కా, అబోహర్, మాలౌట్, గిద్దర్బాహా , భటిండా, రాంపూరా ఫుల్, సంగ్రూర్, పాటియాలా, రాజ్‌పురా, బనూర్, జిరాక్పూర్, పంచకుల, నరాయాణ్గఢ్, పవోంటా సాహిబ్, హెర్బర్ట్‌పూర్, డెహ్రాడూన్, రిషికేశ్, దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, చమోలి, బద్రీనాథ్, మానా కనుమ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 7 (ఎన్‌హెచ్ 7), పంజాబ్ లోని ఫాజిల్కా నుండి ఉత్తరాఖండ్ లోని మానా వరకు నడిచే జాతీయ రహదారి. ఇది పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా వెళుతుంది.[1]
ఎన్‌హెచ్-7 (పాత ఎన్‌హెచ్-58) రిషికేశ్, దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, చమోలి, జోషిమత్, బద్రీనాథ్‌లోని హిందూ పుణ్యక్షేత్రాలను డెహ్రాడూన్, చండీగఢ్‌లతో కలుపుతుంది. శ్రీ హేమకుంట్ సాహిబ్‌కు వెళ్లే యాత్రికులు జోషిమఠ్, బద్రీనాథ్ ల మధ్య ఎన్‌హెచ్-7 పై ఉన్న గోవింద్‌ఘాట్ వద్ద మళ్లింపు తీసుకుంటారు.
జాతీయ రహదారి 7 హిమాలయాల గుండా వెళ్తుంది. మంచు కురిసే ఎగువ ప్రాంతాలలో దీన్ని డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలో మూసివేస్తారు. ఈ రహదారి భారత-టిబెట్ సరిహద్దు సమీపంలోని మానా కనుమ వరకు వెళుతుంది.
జాతీయ రహదారి 7 పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా వెళుతుంది.[2] ఈ జాతీయ రహదారి దాదాపు 845 కి.మీ. (525 మై.).[3]
ఎన్‌హెచ్ 7 భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు నుండి ప్రారంభమవుతుంది, ఫజిల్కా, అబోహర్, మలౌట్, గిద్దర్బాహా, బటిండా, రాంపూరా ఫుల్, బర్నాలా, సంగ్రూర్, పాటియాలా, రాజ్‌పురా, బనూర్, జిరాక్పూర్ వద్ద హర్యానా సరిహద్దు వరకు కలుపుతుంది.[4]
ఎన్‌హెచ్7 జిరాక్పూర్ సమీపంలోని పంచకులాను హర్యానా రాష్ట్రంలోని షాజాద్‌పూర్, నారాయణ్గఢ్తో కలుపుతుంది.
ఎన్‌హెచ్7 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పాంటా సాహిబ్‌తో కాలా అంబ్ను కలుపుతుంది.[5]
ఎన్‌హెచ్ 7 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఇండో/టిబెట్ సరిహద్దు వద్ద ఉన్న మానాను, డెహ్రాడూన్, రిషికేశ్, దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, చమోలి, బద్రీనాథ్ లతో కలుపుతుంది.[6]
3200 మీటర్ల ఎత్తులో మానా గ్రామానికి సమీపంలో ఇది ముగుస్తుంది.