జాతీయ రహదారి 716 బి (NH716బి) ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మధ్య మ్నిర్మించ తలపెట్టిన 117 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే. దీన్ని చిత్తూరు-తాచ్చూరు రహదారి అని కూడా అంటారు. ఈ హైవే భారతమాలలో భాగం. చిత్తూరు సమీపంలోని కినాటంపల్లె వద్ద ప్రారంభమై చెన్నై సమీపంలోని తాచూర్ వద్ద ముగుస్తుంది.[1] దీని నిర్మాణాన్ని 2019 లోనే తలపెట్టినప్పటికీ, భూసేకరణలో జాప్యాల కారణంగా, 2024 మార్చి నాటికి ఇంకా మొదలు కాలేదు.