జానీ (2003 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పవన్ కళ్యాణ్ |
---|---|
నిర్మాణం | అల్లు అరవింద్ |
కథ | పవన్ కళ్యాణ్ |
చిత్రానువాదం | పవన్ కళ్యాణ్ |
తారాగణం | పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ |
సంగీతం | రమణ గోగుల |
నేపథ్య గానం | రమణ గోగుల, హరిహరన్, పవన్ కళ్యాణ్, నందిత, ఉష |
సంభాషణలు | సత్యానంద్ |
ఛాయాగ్రహణం | మధు అంబట్, ఛోటా కె.నాయుడు, శ్యాం పాలక్ |
కూర్పు | యూసఫ్ ఖాన్ |
నిర్మాణ సంస్థ | గీతా ఆర్ట్స్ |
పంపిణీ | గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ |
నిడివి | 180 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
జాని పవన్ కళ్యాణ్ స్వీయ కథాకథనదర్శకత్వంలో రూపొందించబడ్డ తెలుగు చలన చిత్రం. 2003 ఏప్రిల్ 25న అట్టహాసంగా, ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య విడుదలైననూ, వాణిజ్యపరంగా విజయం సాధించలేకపోయింది. పవన్ కళ్యాణ్ నటజీవితంలోనే ఇది అతిపెద్ద వైఫల్యంగా ఈ చిత్రం పేరు తెచ్చుకొన్నది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషించగా, రేణు దేశాయ్, రఘువరన్, రజా మురాద్ కీలక పాత్రలు పోషించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్యను రక్షించడానికి అవసరమైన పోటీలలో ప్రైజ్ మనీ సంపాదించడానికి తన నైపుణ్యాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్న మార్షల్ ఆర్ట్స్ కోచ్ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా ప్రింట్‌లతో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రంగా కూడా ఇది నిలిచింది. ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది.[1][2]
చిన్ననాటనే తల్లిని కోల్పోయిన జానీ (పవన్ కళ్యాణ్) ను అతని తండ్రి (రఘువరన్) కూడా పెద్దగా పట్టించుకోడు. పైగా సిగరెట్లు ఎక్కువ కాలుస్తూ ఉండటం, మద్యం ఎక్కువ సేవిస్తున్న తండ్రిని భరించలేక జానీ ఇంటి నుండి పారిపోతాడు. పెరిగి పెద్దవాడైన జానీ మార్షల్ ఆర్ట్స్ కోచ్ అవుతాడు. జానీ ఒకరిని దేహశుద్ధి చేయటం చూచిన గీత (రేణు దేశాయ్) అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేస్తుంది. అది అపార్థమని తెలుసుకొన్న గీత అతనిని క్షమాపణలు కోరుతుంది. ఇరువురి మధ్య సఖ్యత నెలకొని ప్రేమ, పెళ్ళి ల వరకు దారితీస్తుంది. వివాహానంతరం గీతకు క్యాన్సర్ సోకుతుంది. స్నేహితుల వద్ద నుండి సేకరించిన కొంత మొత్తం డబ్బుతో జానీ గీత వైద్యం కొరకు ముంబై వెళతాడు.
ముంబయిలో ప్రతి రోజు బాక్సింగ్ ఫైట్ లు జరుగుతాయని, జానీకి తెలిసిననూ, తొలుత వద్దనుకొంటాడు. కానీ గీత పరిస్థితి నానాటికి విషమించి, ఒకే రోజులో రెండు లక్షల రూపాయలు అవసరం అవుతాయి. దీనితో జానీ ఒప్పుకొంటాడు. జానీ గీతను బ్రతికించుకొన్నాడా, లేదా అన్నదే తర్వాతి కథ.
ఈ చిత్రం పై పవన్ కళ్యాణ్ చేసినన్ని ప్రయోగాలు బహుశ: భారతదేశంలో ఏ దర్శకుడూ చేసి ఉండరు. మచ్చుకి కొన్ని.
సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఇందులోని సాంకేతిక విలువలను అభినందించలేక పోయాడు. బాక్స్ ఆఫీసు వద్ద విజయానికి నోచుకోలేకపోయినా "జానీ" సినీ విమర్శకుల అభిమానాన్ని చూరగొంది. క్యాన్సర్ బారిన పడ్డ భార్యని రక్షించుకోవటానికి పడ్డ కష్టాలకి జానీ చాలా మంది మహిళా ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు.
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
నారాజు గాకు రా | |||
ఈ రేయి తీయనిది | రమణ గోగుల |
మార్షల్ ఆర్ట్స్లో భాగమయిన ఐకిడో అనే విద్యని పవన్ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా జపాన్కి వెళ్ళి నేర్చుకుని వచ్చాడు.