జానీ వాక్టర్ | |
---|---|
జననం | జాన్ డబ్ల్యు. వాక్టర్ III 1986 ఆగస్టు 31 చార్లెస్టన్, సౌత్ కరోలినా, అమెరికా |
మరణం | 2024 మే 25 లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా, అమెరికా | (వయసు 37)
వృత్తి | నటుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 2007–2024 |
Notable work(s) | జనరల్ హాస్పిటల్ సైబీరియా (టెలివిజన్ సిరీస్) |
జానీ వాక్టర్ (ఆంగ్లం: Johnny Wactor; 1986 ఆగష్టు 31 - 2024 మే 25) ఒక అమెరికన్ నటుడు. జనరల్ హాస్పిటల్ సిరీస్ లో బ్రాండో కార్బిన్, సైబీరియా సిరీస్ లో జానీ పాత్రలకు ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయన ఆర్మీ వైవ్స్ సిరీస్, యుఎస్ఎస్ ఇండియానాపోలిస్ః మెన్ ఆఫ్ కరేజ్, సూపర్సెల్ చిత్రాలలో కూడా పాత్రలు పోషించాడు.
2007లో వచ్చిన లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ ఆర్మీ వైవ్స్ అనే టెలివిజన్ షోతో జానీ వాక్టర్ అరంగేట్రం చేసాడు. ఆ తరువాత, ఆయన వెస్ట్‌వరల్డ్, ది ఓ, స్టేషన్ 19, క్రిమినల్ మైండ్స్, హాలీవుడ్ గర్ల్ వంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లు, పలు టీవీ షోలలో నటించాడు.
అయితే, జనరల్ హాస్పిటల్ లో తన పాత్రకు ఎనలేని గుర్తింపు వచ్చింది. 1963లో ప్రారంభమైన ఈ ధారావాహికలో 2020 నుంచి 2022 వరకు దాదాపు 200 ఎపిసోడ్స్‌లలో జానీ వాక్టర్ నటించాడు.
లాస్ ఏంజిల్స్‌లో 2024 మే 25న ఆయన ప్రయాణిస్తున్న కారులో దోపిడీ చేస్తూ అగంతకులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించాడు.[1] ఆయన వయస్సు 37 సంవత్సరాలు.[2][3][4][5] ఆగస్ట్ 15, 2024న, వాక్టర్ హత్యకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు.[6] నాలుగు రోజుల తర్వాత, సౌత్ లాస్ ఏంజెల్స్ స్ట్రీట్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులపై ప్రాసిక్యూటర్లు హత్య కేసు పెట్టారు; ఇద్దరు ఇతర వ్యక్తులపై తక్కువ ఛార్జీలు విధించబడ్డాయి.[7]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)