జాన్ ఇలియట్ డ్రింక్‌వాటర్ బెథూన్ (1801 - 1851) విద్యావేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, బహుభాషావేత్త. అతను భారతదేశంలో మహిళల విద్యను ప్రోత్సహించడంలో చేసిన కృషికి పేరుగాంచాడు. [1] అతను కలకత్తాలోని కలకత్తా ఫిమేల్ స్కూల్ (ప్రస్తుతం బెథూన్ కాలేజ్ అని పిలుస్తారు) స్థాపకుడు, [2] ఇది ఆసియాలోని పురాతన మహిళా కళాశాలగా పరిగణించబడుతుంది. [3] అతను ఇంగ్లాండ్‌లో న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో న్యాయ సభ్యుడిగా నియమించబడి భారతదేశానికి వచ్చాడు. [4] తదుపరి మహిళా విద్యలో ఆయన చేసిన ప్రయత్నాలకు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, బెంగాలీ పునరుజ్జీవనోద్యమ సభ్యులు చురుకుగా మద్దతు ఇచ్చారు. [5]
1849లో, బెథూన్ అప్పటి బ్రిటీషు ఇండియా రాజధాని అయిన కలకత్తా నగరంలో మహిళా విద్యకై ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ఆ తరువాతి కాలంలో ఈయన పేరు మీదుగా నామకరణం చేయబడి బెథూన్ కళాశాలగా ప్రసిద్ధి చెందింది.[6]
బెథూన్, జాన్ డ్రింక్‌వాటర్ బెథూన్ యొక్క పెద్ద కుమారుడు ఇంగ్లాండ్లోని ఈలింగ్‌లో జన్మించాడు. [7] అతను కేంబ్రిడ్జి లోని ట్రినిటీ కాలేజీలో చదువుకున్నాడు. తరువాత అతను హోమ్ ఆఫీస్ కౌన్సెల్ గా ఉద్యోగం పొందాడు. మునిసిపల్ సంస్కరణ చట్టం, టైథే కమ్యుటేషన్ చట్టం, కౌంటీ కోర్టుల చట్టం సహా అనేక ముఖ్యమైన సంస్కరణలను ఆయన ఈ పదవిలో ఉండగా రూపొందించాడు. 1848 లో, అతను సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా నియమితుడయ్యాడు. తరువాత కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడయ్యాడు. [8]
దక్షిణారంజన్ ముఖర్జీ, రామ్‌గోపాల్ ఘోష్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, మదన్ మోహన్ తార్కాలంకర్ ల మద్దతుతో బెథూన్ 1849 లో కలకత్తా ఫిమేల్ స్కూల్‌ను స్థాపించాడు. [9] ఈ పాఠశాల బైతఖానాలోని ముఖర్జీ ఇంటిలో ప్రారంభమైంది (ప్రస్తుతం దీనిని బౌబజార్ అని పిలుస్తారు). అందులో 21 మంది బాలికలు చేరారు. [10]: 11–12
మరుసటి సంవత్సరం, నమోదు 80 కి పెరిగింది. [11] నవంబరులో, కార్న్‌వాలిస్ స్క్వేర్ యొక్క పడమటి వైపున ఉన్న ఒక ప్లాట్‌లో, శాశ్వత పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసారు. శంకుస్థాపన రాతిపై ఉంచిన రాగి పలకపై "హిందూ బాలికల పాఠశాల" అనే పేరు చెక్కారు. [12]: 15–16 1851 ఆగష్టులో బెథూన్ మరణించిన తరువాత పాఠశాలకు మద్దతు క్షీణించింది. [11] 1856 లో ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకుంది, 1862-63లో దాని స్థాపకుడి పేరుమీద బెథూన్ స్కూల్ అని నామకరణం చేసింది. [13] 1879 లో దీనిని భారతదేశంలో మొట్టమొదటి మహిళా కళాశాల, బెథూన్ కాలేజీగా అభివృద్ధి చేశారు. [14]
↑Sengupta, Subodh Chandra and Bose, Anjali (editors), (1976/1998), Sansad Bangali Charitabhidhan (Biographical dictionary) Vol I, in Bengali, p 366, ISBN 8185626650
↑Acharya, Poromesh (1990). "Education in Old Calcutta". In Chaudhuri, Sukanta (ed.). Calcutta: The Living City. Vol. I. Oxford University Press. p. 87. ISBN978-0-19-563696-3.
↑Find A Grave, database and images (accessed 19 March 2020), memorial page for John Elliot Drinkwater Bethune (1801–12 Aug 1851), Find A Grave Memorial no. 105604985, citing Lower Circular Road Cemetery, Calcutta, West Bengal, India; Maintained by Chris Nelson (contributor 46617359)
విషయాలు బెంగాల్ చరిత్ర·బ్రిటీష్ రాజ్· బెంగాళీ సాహిత్యం · బెంగాళీ కవిత్వం · బెంగాళీ సంగీతం ·బ్రహ్మ సమాజం· ఏషియాటిక్ సొసైటీ · ఫోర్ట్ విలియం కళాశాల · యువ బెంగాల్ ఉద్యమం · బ్రిటీషు ఇండియా అసోసియేషన్ ·స్వదేశీ·సత్యాగ్రహం· తత్వబోధిని పత్రిక · సులావ సమాచార్ · ఆనందబజార్ పత్రిక · టాగూర్ కుటుంబం · రబీంద్ర సంగీత్ ·శాంతినికేతన్·విశ్వభారతి విశ్వవిద్యాలయం· వంగీయ సాహిత్య పరిషత్తు · సంబద్ ప్రభాకర్