![]() జాన్ రిచర్డ్ రీడ్ (1960) | ||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జాన్ రిచర్డ్ రీడ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1928 జూన్ 3|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2020 అక్టోబరు 14 ఆక్లాండ్, న్యూజీలాండ్ | (వయసు: 92)|||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | బోగో | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్-బ్రేక్ కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | రిచర్డ్ రీడ్ (కుమారుడు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 49) | 1949 జూలై 23 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1965 జూలై 8 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 1 |
జాన్ రిచర్డ్ రీడ్ (1928, జూన్ 3 – 2020, అక్టోబరు 14) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 34 టెస్ట్ మ్యాచ్‌లకు న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. న్యూజీలాండ్ ఎనిమిదవ టెస్ట్ కెప్టెన్, 1956లో వెస్టిండీస్‌పై స్వదేశంలో, 1962లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన మొదటి వ్యక్తి.[1]
బలమైన, దూకుడు బౌలర్‌గా రాణించాడు. 1949 ఇంగ్లాండ్ పర్యటనలో రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు, చివరి టెస్టుతోపాటు అనేక మ్యాచ్‌లలో వికెట్ కీపింగ్ చేశాడు.[2]
పదవీ విరమణ తర్వాత, 1969లో సౌత్ పోల్‌లో మొదటి క్రికెట్ మ్యాచ్‌గా భావించబడే మ్యాచ్‌లో ఆడాడు.
1975 నుండి 1978 వరకు న్యూజిలాండ్ క్రికెట్‌కు జాతీయ సెలెక్టర్‌గా పనిచేశాడు. 1981లో కోచ్‌గా దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. వర్ణవివక్ష యుగంలో దక్షిణాఫ్రికాపై క్రీడా బహిష్కరణ 'చెడ్డ భావన' అని ఇంతకుముందు పేర్కొన్నాడు.[3]
1993 నుండి 2002 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు. 50 టెస్టులు, 98 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు సేవలందించాడు.[3]
2003లో న్యూజిలాండ్ క్రికెట్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[3] 2015 ఆగస్టు 7న ట్రెవర్ బార్బర్ మరణించిన తర్వాత, రీడ్ జీవించి ఉన్న న్యూజిలాండ్ టెస్ట్ క్రికెటర్‌గా అత్యంత పెద్ద వయసులో నిలిచాడు.[4][5]
రీడ్ తన 92 సంవత్సరాల వయస్సులో 2020, అక్టోబరు 14న ఆక్లాండ్‌లో మరణించాడు.[6]
1962 క్వీన్స్ బర్త్‌డే ఆనర్స్‌లో క్రికెట్‌కు కృషి కోసం రీడ్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్‌కి అధికారిగా నియమించబడ్డాడు. 2014 న్యూ ఇయర్ ఆనర్స్‌లో క్రికెట్‌కు చేసిన సేవల కోసం న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కు సహచరుడిగా ఎంపికయ్యాడు.[7]