వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జార్జ్ ఆల్ఫ్రెడ్ లోమాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కెన్సింగ్‌టన్, మిడిల్‌సెక్స్, ఇంగ్లండ్ | 1865 జూన్ 2|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1901 డిసెంబరు 1 వోర్సెస్టర్, బ్రిటిష్ కేప్ కాలనీ | (వయసు 36)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతివాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతివాటం మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 51) | 1886 జులై 5 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1896 జూన్ 24 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1884–1896 | సర్రీ | |||||||||||||||||||||||||||||||||||||||
1894–1897 | వెస్టర్న్ ప్రావిన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2009 అక్టోబరు 1 |
జార్జ్ ఆల్ఫ్రెడ్ లోమాన్ (1865 జూన్ 2 - 1901 డిసెంబరు 1) ఇంగ్లీష్ క్రికెట్ ఆటగాడు. అతను ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్లలో ఒకడిగా పరిగణించబడ్డాడు.[1] గణాంకాలు చూస్తే, పదిహేను కంటే ఎక్కువ వికెట్లు తీసిన టెస్ట్ బౌలర్లలో అతితక్కువ బౌలింగ్ సగటు ఇతనిదే. ఐసీసీ రేటింగ్స్‌లో బౌలర్ల పీక్ రేటింగుల్లో రెండవ అతి ఎక్కువ రేటింగ్ కూడా అతనిదే. అతను మొత్తం టెస్ట్ చరిత్రలో అత్యల్ప స్ట్రైక్ రేట్ (తీసిన ప్రతి వికెట్ మధ్య బౌలింగ్ చేసిన బంతులు) రికార్డును కూడా కలిగి ఉన్నాడు.
1884లో సర్రీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రవేశించిన లోమాన్‌కి తర్వాతి సంవత్సరం 142 వికెట్లు సాధించిన అతని పెర్ఫార్మెన్స్ జట్టుకు లీడింగ్ బౌలర్ స్థానాన్ని సంపాదించి పెట్టింది. 1886లో ఆస్ట్రేలియాతో జరిగిన సీరీస్‌లో ఇంగ్లండ్ జట్టులో స్థానం సంపాదించుకున్న లోమాన్ మూడవ మ్యాచ్ నుంచే బౌలర్‌గా తన ప్రతిభావంతమైన ప్రదర్శన చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి మూడేళ్ళ పాటు అతని బౌలింగ్ పెర్ఫార్మెన్స్ వల్ల ఆనాటి ప్రపంచ స్థాయి అత్యుత్తమ బౌలర్‌గా స్థిరపడ్డాడు. 1890లో అధికారికంగా కౌంటీ ఛాంపియన్‌షిప్స్ ప్రారంభం అయ్యాకా అక్కడి వికెట్లపై కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.
1892లో లోమాన్‌కు క్షయ వ్యాధి సోకిందన్న షాకింగ్ వార్త వెలువడింది. చలికాలంలో ఆరోగ్యం మెరుగుదలకు ఇంగ్లండ్ నుంచి నేటి దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌కు ఓడలో వెళ్ళాడు. 1892-94 మధ్యకాలంలో క్రికెట్ ఆడడానికి తగినంత ఆరోగ్యం అతనికి లేకపోయింది. కేప్ కాలనీ (దక్షిణాఫ్రికా)లో సుప్రసిద్ధ క్రికెట్ టోర్నీ అయిన 1894-95 సీజన్ కర్రీ కప్ ఫైనల్లో వెస్టర్న్ ప్రావిన్స్ జట్టుకు ఆడడంతో క్రికెట్లోకి తిరిగివచ్చినట్టైంది. 1895-96ల్లో ఇంగ్లండ్ వెళ్ళి సర్రీకి, ఇంగ్లండ్ జట్టుకు కూడా ఆడాడు. అయితే, ఇంగ్లండ్ జట్టు ఇస్తున్న పది పౌండ్ల మ్యాచ్ ఫీజు సరిపోదనీ, చెల్లింపు పెంచాలని చేసిన వివాదంతో ఇంగ్లండ్‌కి ఆడడం మానేశాడు. ఇంతలో 1896లో తన ఆనారోగ్యం తిరగబెట్టడంతో తన కెరీర్ ముగించి తిరిగి దక్షిణాఫ్రికా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 1897లో దక్షిణాఫ్రికా కౌంటీ క్రికెట్లో ఆడడమే కాక 1901లో దక్షిణాఫ్రికా జట్టులో భాగంగా ఇంగ్లండ్ పర్యటించాడు. 1901 డిసెంబరు 1న తొమ్మిదేళ్ళు క్షయతో పోరాడిన లోమాన్ దాని కారణంగా తన 36 ఏళ్ళ వయసులో దక్షిణాఫ్రికాలోనే మరణించాడు.[2]
అతను మీడియం పేస్ బౌలర్. అతని కాలంలోని ఇంగ్లీషు పిచ్‌లపై మంచి స్పిన్‌ను కూడా సాధించేవాడు. అయితే, వర్షం పిచ్‌పై ప్రభావం చూపినప్పుడు అతను ఆడలేకపోయాడు. అత్యుత్తమ బ్యాటర్లకు బౌలింగ్ చేసినప్పుడు లోహ్‌మాన్ నైపుణ్యంతోనూ, బోల్తా కొట్టించే రీతిలోనూ బౌలింగ్ చేసేవాడు. అతను తన పేస్, ఫ్లైట్, బ్రేక్‌లను బ్యాటర్లను ఆశ్చర్యపరిచేరీతిలో మార్చుకోగలిగేవాడు. ఇదంతా కలసి మెరుగైన పిచ్‌లపై అతను బ్యాటర్లను ఆందోళనకు గురిచేయగలిగేవాడు. అతను తన కాలంలో అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్‌గానూ పేరొందాడు. కౌంటీ క్రికెట్‌లో 1887లో సర్రీ తరపున రెండు సెంచరీలు కొట్టి, 25 సగటు సాధించిన హార్డ్-హిటింగ్ బ్యాట్స్‌మన్ కూడాను.
2016లో లోమాన్‌ను ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు.[3]