వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మొహమ్మద్ జావేద్ మియాందాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కరాచీ, సింధ్, పాకిస్తాన్ | 1957 జూన్ 12|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 8 అం. (1.73 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్ ఆర్మ్ (లెగ్ బ్రేక్) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్మాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 71) | 1976 9 అక్టోబర్ - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1993 16 డిసెంబర్ - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 15) | 1975 జూన్ 11 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1996 9 మార్చ్ - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1975–1991 | హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1976–1979 | సస్సెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1980–1985 | గ్లామర్‌గాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNక్రిక్ ఇన్ఫో, 2009 మార్చి 10 |
మొహమ్మద్ జావేద్ మియాందాద్ (జననం: 1957 జూన్ 12) ఒక పాకిస్తానీ క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్.[1]ఇతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో 1975 నుండి 1996 వరకు టెస్టు మ్యాచులు, వన్డే మ్యాచులు ఆడాడు.[2] మియాందాద్ తన సమకాలీనులైన క్రికెటర్ల నుండి, విమర్శకుల నుండి, క్రికెట్ చరిత్రకారులనుండి ప్రశంసలు పొందాడు. ఇతడు ESPN లెజెండ్స్ ఆఫ్ క్రికెట్‌లో ఉత్తమ క్రికెటర్‌గా 44వ ర్యాంకును సంపాదించాడు.[3]ఇతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.1986లో భారతజట్టుతో ఆడిన ఆటలో చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా సిక్సర్ కొట్టి విజయం తెచ్చిపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి బంతికి సిక్సర్ కొట్టి విజయం సాధించడం అదే మొదటిసారి.[4] క్రికటర్‌గా వైదొలగిన తర్వాత ఇతడు పాకిస్తాన్ క్రికెట్ టీముకు పలు సందర్భాలలో కోచ్‌గా వ్యవహరించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌లో పలు కీలక బాధ్యతలను చేపట్టాడు.[5]
2009లో మియాందాద్‌కు "ఐ.సి.సి.క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్"లో చోటు దక్కింది.[6]
జావేద్ మియాందాద్ 1957, జూన్ 12న కరాచీలో జన్మించాడు.[7] ఇతని తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రం పాలన్‌పూర్ నుండి కరాచీకి వలస వచ్చారు. ఇతని తండ్రి మియాందాద్ నూర్‌మొహమ్మద్ త్యాగి పాలన్‌పూర్, అహ్మదాబాద్, బరోడాలలో పోలీసు శాఖలో పనిచేసేవాడు.[8] ఇతని ముగ్గురు సోదరులు అన్వర్ మియాందాద్, సొహైల్ మియాందాద్, బషీర్ మియాందాద్ పాకిస్తాన్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు.[9][10][11] టెస్ట్ ఆటగాడు ఫైజల్ ఇక్బాల్ ఇతని మేనల్లుడు.[12]
మియాందాద్ తన టెస్ట్ క్రికెట్ జీవితం 1976, అక్టోబరు 9న లాహోర్ గడాఫీ స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో ఆడిన టెస్టు మ్యాచుతో ప్రారంభమయ్యింది.[1] ఆ మ్యాచులో ఇతడు 163, 25(నాట్ ఔట్) పరుగులు చేసి తొలి టెస్టులో సెంచురీ చేసిన అతి పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అప్పటికి అతని వయసు 19 సంవత్సరాల 119 రోజులు మాత్రమే. ఆ మ్యాచులో ఇతడు ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఆ మ్యాచు పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.[13][14]ఆ సీరిస్‌లో మూడవ మ్యాచ్( కరాచీ నేషనల్ స్టేడియం)లో 206 పరుగులు చేసి డబుల్ సెంచురీ చేసిన పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 47 యేళ్ల జార్జ్ హేడ్లీ పేరు మీద ఈ రికార్డు ఉండేది.[15][16]ఆ సిరీస్‌లో మియాందాద్ 5 ఇన్నింగులలో 504 పరుగులు చేసి అత్యధిక పరుగులు తీసిన ఆటగాడిగా నిలిచాడు.[17] ఇతని ఆట పాకిస్తాన్ 2-0 తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి తోడ్పడింది.[15]
అది మొదలు మియాందాద్ 1993 వరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే జట్లతో మొత్తం 124 టెస్ట్ మ్యాచులలో 189 ఇన్నింగులలో బ్యాటింగ్ చేశాడు. ఇతడు 8,832 టెస్టు పరుగులు తీశాడు. 2015లో యూనిస్ ఖాన్ బద్దలు చేసే వరకు ఇదే పాకిస్తాన్ క్రికెటర్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు. కానీ ఇతడు తన 17 సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో 10,000 పరుగుల లక్ష్యాన్ని అధిగమించలేక పోయాడు.[1][18] మియాందాద్ చేసిన 23 సెంచురీలు, 43 అర్థశతకాలు పాకిస్తాన్ జట్టు రికార్డులుగా ఉండేవి. ఇంజమాముల్ హక్ ఈ రికార్డులను బద్దలు చేశాడు. ఇతడు 6 డబుల్ సెంచురీలు చేశాడు. మొదటి టెస్టు, వందవ టెస్టులలో సెంచురీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.[19] ఇతడు తన అత్యధిక స్కోరు 280 పరుగులు (నాట్ ఔట్) భారత్ జట్టుపై తీశాడు. ఆ మ్యాచులో పాకిస్తాన్ భారత్‌పై ఇన్నింగ్స్, 119 పరుగుల తేడాతో గెలుపొందింది.[20]
అంతర్జాతీయ క్రికెట్‌లో జావేద్ మియాందాద్ ఫలితాలు[21] | ||||||
---|---|---|---|---|---|---|
మ్యాచులు | గెలుపు | ఓటమి | డ్రా | టై | ఫలితాలు తేలనివి | |
టెస్ట్[22] | 124 | 39 | 23 | 62 | 0 | – |
వన్డే[23] | 233 | 119 | 105 | - | 2 | 7 |
మియాందాద్ తొలి వన్డే మ్యాచ్ 1975 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టుతో బర్మింగ్‌హామ్‌లో ఆడాడు. ఇతని చివరి వన్డే మ్యాచ్ కూడా ప్రపంచకప్ మ్యాచ్ కావడం గమనార్హం.[24][25]వన్డేలలో ఇతని అత్యధిక స్కోరు 119 పరుగులు(నాట్ ఔట్). 1982లో గడాఫీ స్టేడియంలో భారత్‌పై జరిగిన వన్డే మ్యాచులో 77 బంతులలో ఈ పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్ పాకిస్తాన్ ఓడిపోయింది.[5][26]
1986లో షార్జాలో జరిగిన ఆస్ట్రెలేషియా కప్పును దక్కించుకోవడం ద్వారా పాకిస్తాన్ మొదటి ముఖ్యమైన టోర్నమెంటును గెలుపొందింది. ఫైనల్ మ్యాచిలో ఇండియాపై మియాందాద్ 116 పరుగులు తీసి అజేయంగా నిలిచాడు.[27][28] ఇది వన్డే క్రికెట్ చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచింది. దీనితో మియాందాద్ హీరోగా వీక్షకుల మదిలో నిలిచిపోయాడు.[5][29][30]
ఇతడు ఆరు ప్రపంచకప్ టోర్నమెంటులలో పాల్గొన్న ఇద్దరిలో ఇతడు మొట్టమొదటి వాడు. సచిన్ టెండూల్కర్ ఈ రికార్డును నెలకొల్పిన రెండవ క్రికెటర్.
1979-80 భారత్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తాన్ కెప్టెన్ అసిఫ్ ఇక్బాల్ ఉద్వాసన తర్వాత 22యేళ్ల జావేద్ మియాందాద్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[31] పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీనియర్ ఆటగాళ్లైన జహీర్ అబ్బాస్, సర్ఫరాజ్ నవాజ్, మాజిద్ ఖాన్ వంటి వారిని పక్కనపెట్టి ఇతనికి నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. మొదట్లో ఇతడు కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నా కెప్టెన్‌గా 1981/82లలో మొదటి రెండు సిరీస్‌లలో ఆస్ట్రేలియాతో గెలుపు, వెస్ట్ ఇండీస్‌తో 0-1 ఓటమితో గట్టెక్కాడు.[32][33] ఇతని వ్యతిరేకులు బలం పుంజుకోవడంతో ఇతని మొదటి దఫా కెప్టెన్సీ శ్రీలంక జట్టుతో జరిగిన హోమ్ సిరీస్‌తో ముగిసింది.[34][35]
మియాందాద్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు 1998 - 2004 మధ్యకాలంలో మూడు సార్లు కోచ్‌గా వ్యవహారించాడు. తరువాత భారతదేశంలో అతనికి కోచ్‌గా, టీ.వీ.వ్యాఖ్యాతగా అవకాశాలు వచ్చాయి. [36] 2012లో ఇతడు 20-20 వరల్డ్ కప్ టోర్నమెంటులో శ్రీలంక జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంటుగా ఎంపికయ్యాడు.
ఇతడు తహీరా సైగల్‌ను 1981లో వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ఇతనికి కుమారుడు జునాయిద్ మియాందాద్ అంతర్జాతీయ నేరస్థుడు దావూద్ ఇబ్రహీం కుమార్తె మహ్రూఖ్ ఇబ్రహీంను వివాహం చేసుకున్నాడు[37]
ప్రత్యర్థి | మ్యాచులు | ఇన్నింగులు | నాట్ ఔట్ | పరుగులు | అత్యధిక పరుగులు | సగటు | 100 | 50 | కాట్ | స్టంప్డ్ |
---|---|---|---|---|---|---|---|---|---|---|
ఆస్ట్రేలియా | 25 | 40 | 2 | 1797 | 211 | 47.28 | 6 | 7 | 1 | 1 |
ఇంగ్లాండు | 22 | 32 | 6 | 1329 | 260 | 51.11 | 2 | 9 | 20 | – |
భారతదేశం | 28 | 39 | 6 | 2228 | 280* | 67.51 | 5 | 14 | 18 | – |
న్యూజీలాండ్ | 18 | 29 | 5 | 1919 | 271 | 79.95 | 7 | 6 | 20 | – |
శ్రీలంక | 12 | 16 | 2 | 882 | 203* | 41.57 | 1 | 2 | 11 | – |
వెస్ట్ ఇండీస్ | 16 | 28 | 0 | 834 | 114 | 29.78 | 2 | 2 | 11 | – |
జింబాబ్వే | 3 | 5 | 0 | 143 | 70 | 28.60 | 0 | 1 | 0 | – |
మొత్తం | 124 | 189 | 21 | 9132 | 280* | 45.68 | 23 | 41 | 81 | 1 |
ప్రత్యర్థి | మ్యాచులు | ఇన్నింగులు | నాట్ ఔట్ | పరుగులు | అత్యధిక స్కోరు | సగటు | 100 | 50 | కాట్ | స్టంప్డ్ |
---|---|---|---|---|---|---|---|---|---|---|
ఆస్ట్రేలియా | 35 | 33 | 3 | 1019 | 74* | 33.96 | 0 | 7 | 10 | 1 |
బంగ్లాదేశ్ | 1 | 0 | – | 15 | 15 | 15.00 | 0 | 0 | 0 | – |
కెనడా | 1 | 1 | 0 | – | – | – | – | – | 0 | – |
ఇంగ్లాండు | 27 | 27 | 6 | 991 | 113 | 47.19 | 1 | 10 | 12 | – |
భారతదేశం | 35 | 34 | 11 | 1175 | 119* | 51.08 | 3 | 6 | 13 | – |
నెదర్లాండ్స్ | 1 | 0 | – | – | – | – | – | – | 0 | – |
న్యూజీలాండ్ | 24 | 20 | 3 | 702 | 90* | 41.29 | 0 | 4 | 6 | – |
దక్షిణాఫ్రికా | 3 | 3 | 0 | 145 | 107 | 48.33 | 1 | 0 | 12 | – |
శ్రీలంక | 35 | 31 | 10 | 1141 | 115* | 54.33 | 2 | 8 | 12 | – |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 1 | 0 | – | – | – | – | – | – | 0 | – |
వెస్ట్ ఇండీస్ | 64 | 64 | 7 | 1930 | 100* | 33.85 | 1 | 12 | 14 | 1 |
జింబాబ్వే | 6 | 5 | 1 | 263 | 89 | 65.75 | 0 | 3 | 2 | – |
మొత్తం | 233 | 218 | 42 | 7381 | 119* | 41.70 | 8 | 50 | 71 | 2 |
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
, |date=
, and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
, |date=
, and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
, |date=
, and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
(help)[permanent dead link]
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
, |date=
, and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
, |date=
, and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
, |date=
, and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
, |date=
, and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help).
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |accessdate=
and |archive-date=
(help)
అంతకు ముందువారు ఆసిఫ్ ఇక్బాల్ |
పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ 1980–1981 |
తరువాత వారు జహీర్ అబ్బాస్ |
అంతకు ముందువారు ఇమ్రాన్ ఖాన్ |
పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ 1992 |
తరువాత వారు సలీమ్ మాలిక్ |