జి. వి. ప్రకాష్ కుమార్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | జి. వి. ప్రకాష్ |
జననం | చెన్నై, తమిళనాడు | 1987 జూన్ 13
సంగీత శైలి | సినీ సంగీతం |
వృత్తి | సినీ సంగీత దర్శకుడు, వాయిద్య కారుడు, నేపథ్య గాయకుడు, సినీ నిర్మాత, నటుడు |
వాయిద్యాలు | గిటార్, పియానో/కీబోర్డు, నేపథ్య గానం |
క్రియాశీల కాలం | 2006–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సైంధవి (నేపథ్య గాయని) (m.2013, div. May 2024) [1] |
పిల్లలు | ఒక కూతురు (జ.2020) |
బంధువులు | ఎ. ఆర్. రెహమాన్ (మేనమామ) |
జి. వి. ప్రకాష్ ఒక భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. 2010 సంవత్సరం మొదట్లో వెలుగులోకి వచ్చాడు.[2] తర్వాత ఇతను సినీ నిర్మాణం, నటనా రంగంలోకి ప్రవేశించాడు. ఇతను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహ్మాన్ కు మేనల్లుడు. ఇతని భార్య సైంధవి గాయని. ముందుగా రెహమాన్ దగ్గర పలుచిత్రాలకు సంగీత విభాగంలో పనిచేశాడు. కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ దగ్గర కూడా శిష్యరికం చేసి తరువాత సొంతంగా సంగీత దర్శకత్వం వహించడం ప్రారంభించాడు.[3]
ప్రకాష్ తల్లి దండ్రులు జి. వెంకటేష్, ఏ. ఆర్. రిహానా. తల్లి ఏ. ఆర్. రెహ్మాన్ కు అక్క.[4] తల్లి రెహనాకు సంగీతం అంటే ఆసక్తి ఉండటంతో ప్రకాష్ ను నాలుగు సంవత్సరాల వయసు నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి పంపించేది. ఆరేళ్ళకి పియానో క్లాసులో చేరాడు. అదే సమయంలో మేనమామ రెహమాన్ ప్రకాష్ కు పాటలు నేర్పించి సినిమాల్లో పాడించాడు. ప్రకాష్ ఏడో తరగతిలో ఉండగా తల్లిదండ్రులు విడిపోయారు. పిల్లలు తండ్రి దగ్గరే ఉండిపోయారు. తల్లి మాత్రం ఒంటరిగా ఉంటూ గాయనిగా తన కెరీర్ ప్రారంభించింది.[5]
జూన్ 27, 2013 న ప్రకాష్ గాయని సైంధవిని చెన్నై లోని మేయర్ రామనాథన్ చెట్టియార్ హాల్ వేదికపై వివాహం చేసుకున్నాడు. సైంధవి, ప్రకాష్ చెట్టినాడ్ విద్యాశ్రమంలో కలిసి చదువుకున్నారు.[6] ఈ జంట 13 మే 2024న విడిపోతున్నట్లు ప్రకటించారు.[7]
ప్రకాష్ మొదటి సారిగా తన మేనమామ ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన శంకర్ సినిమా జెంటిల్మేన్ కి సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశాడు. ఇంకా రెహమాన్ ఇతర ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు.[8] తర్వాత కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ తో కలిసి పనిచేశాడు. అన్నియన్ (తెలుగులో అపరిచితుడు), ఉన్నాళే ఉన్నాళే అనే రెండు సినిమాల్లో పాటలు పాడాడు.
ప్రకాష్ మొదటిసారిగా ఎస్. శంకర్ నిర్మాణ సారథ్యంలో, వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వేయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. తరువాత ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన మదరాస పట్టణం అనే సినిమాకు ఇతను కూర్చిన సంగీతం కూడా ఆకట్టుకున్నది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మయాక్కం ఎన్న అనే సినిమా ధనుష్ హీరోగా ప్రకాష్ కి మూడో సినిమా. ఈ సినిమా సంగీతం కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది.
సంవత్సరం | తమిళం | తెలుగు | ఇతర భాషలు | గమనికలు |
---|---|---|---|---|
2006 | వెయిల్ • | వేసవి | ||
2007 | ఓరం పో • | నేను ఆటోవాని (2011) | ||
కిరీడం • | పూర్ణామార్కెట్ (2011) | |||
పొల్లాధవన్ • (3 పాటలు) | పుండా (2010) (కన్నడ) ♦ | |||
ఎవనో ఒరువన్ • # [టైటిల్ సాంగ్] | ఎవరో ఒకారు (2009) | |||
వెల్లి తిరై • | ||||
కాళై • | ||||
2008 | ఉల్లాసంగా ఉత్సాహంగా • | ఉల్లాస ఉత్సాహ (2009) (కన్నడ) ♦
అయ్యో పావం (2009) ( మలయాళం ) |
||
కుసేలన్ • | కథానాయకుడు • | |||
ఆనంద తాండవం • | ఆనంద తాండవం (2009) | |||
నాన్ అవల్ అధు • (2 పాటలు) | నేనూ తనూ ఆమె | సౌండ్‌ట్రాక్ విడుదల చేయబడింది; సినిమా విడుదల కాలేదు | ||
సేవల్ • | బల్లెం (2011) | |||
2009 | అంగడి తేరు • # [4 పాటలు] | షాపింగ్ మాల్ (2010) | ||
ఆయిరతిల్ ఒరువన్ • | యుగానికి ఒక్కడు (2010) | |||
ఇరుంబుక్కోట్టై మురట్టు సింగం • # | సూపర్ కౌబాయ్ (2010) | |||
2010 | మద్రాసపట్టణం • | 1947 ఎ లవ్ స్టోరీ (2011) | ||
డార్లింగ్ • | ||||
వా • | ||||
ఆడుకలం • | పందెం కొల్లు (2015) |
| ||
2011 | నర్తగి • | |||
దైవ తిరుమగల్ • | ||||
మయక్కమ్ ఎన్న • | మిస్టర్ కార్తీక్ (2016) | |||
ముప్పోజుదుమ్ అన్ కార్పనైగల్ • | నిరంతరమ్ నీ ఊహలో | |||
2012 | ఎందుకంటే... ప్రేమంట! • | |||
సాగుని • | శకుని | 2 పాటలను మళ్లీ ఉపయోగించారు | ||
గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ – పార్ట్ 1 • #2 ( హిందీ ) | ||||
జోకర్ • # (హిందీ) | ||||
గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ – పార్ట్ 2 • #2 (హిందీ) | ||||
తాండవం • | శివ తాండవం | |||
పరదేశి • | పరదేశి | |||
నాన్ రాజవగా పొగిరెన్ • | ||||
2013 | ఒంగోలు గీత • # [4 పాటలు] | |||
అన్నకోడి • | ||||
ఉదయమ్ NH4 • | NH 4 | |||
తలైవా • | అన్నా - నాయకుడిగా జన్మించాడు | |||
రాజా రాణి • | రాజా రాణి | |||
JK ఎనుమ్ నన్బనిన్ వాఙ్కై • # | రాజాధి రాజా • # | |||
నిమిరందు నిల్ • | జండా పై కపిరాజు • | |||
2014 | నాన్ సిగప్పు మనితన్ • | ఇంద్రుడు | ||
శైవం • | ||||
ఇరుంబు కుత్తిరై • | ||||
డార్లింగ్ • | ||||
అగ్లీ • # (హిందీ) | ||||
2015 | పెన్సిల్ | |||
కొంబన్ | ||||
రాజతంతిరం # | ||||
ఇదు ఎన్న మాయం | ||||
కావల్ # (5 పాటలు) | ||||
కాక ముట్టై | హాఫ్ టికెట్ (మరాఠీ) | |||
త్రిష ఇల్లానా నయనతార | త్రిష లేదా నయనతార | |||
ఈట్టి | ||||
2016 | విసరనై | విచారణ | ||
తేరి |
| |||
ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు | ||||
మీండుమ్ ఒరు కాదల్ కధై | ||||
బ్రూస్ లీ | ||||
కడవుల్ ఇరుకన్ కుమారు | ||||
2017 | ముప్పరిమానం | |||
లెన్స్ | ||||
2018 | సెమ్మ | చిన్ని కృష్ణుడు (2020) | ||
2019 | కుప్పతు రాజా | |||
వాచ్ మాన్ | ||||
100% కాదల్ | ||||
అసురన్ |
| |||
2020 | పుతం పుదు కాళై | |||
సూరరై పొట్రు | ఆకాశం నీ హద్దురా |
| ||
2021 | వణక్కం దా మాప్పిలే | |||
తలైవి | తలైవి | తలైవి (హిందీ) | ||
బ్యాచిలర్ # [3 పాటలు] | ||||
2022 | మారన్ | |||
సెల్ఫీ | ||||
విసితిరన్ | ||||
అయ్యంగారన్ | ||||
యానై | ||||
సర్దార్ | ||||
2023 | వాతి | సార్ | ||
రుద్రన్ # [5 పాటలు] | రుద్రుడు | |||
మోడ్రన్ లవ్ చెన్నై | వెబ్ సిరీస్ ఎపిసోడ్ 3: "కాదల్ ఎన్‌బదు కన్నుల హార్ట్ ఇరుక్కురా ఎమోజి" | |||
అరె # | అరె # | |||
కాథర్ బాషా ఎండ్ర ముత్తురామలింగం | ||||
అనేతి | ||||
కారుమేగంగల్ కలైగింద్రణ | ||||
మార్క్ ఆంటోనీ | ||||
టైగర్ నాగేశ్వరరావు | ||||
జపాన్ | ||||
ఆదికేశవ | ||||
2024 | కెప్టెన్ మిల్లర్ | |||
మిషన్: చాప్టర్ 1 | ||||
సైరన్ | ||||
రెబెల్ | ||||
కాల్వన్ | ||||
డియర్ | ||||
సర్ఫిరా (హిందీ) | ||||
తంగలన్ | ||||
అమరన్ | ||||
లక్కీ బాస్కర్ | ||||
మట్కా | ||||
రాబిన్‌హుడ్ |
ప్రకాష్ 2013 లో జి. వి. ప్రకాష్ కుమార్ ప్రొడక్షన్స్ పేరుతో స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ మొట్టమొదటి సినిమా, బాలు మహేంద్ర దగ్గర సహాయకుడుగా పనిచేసిన విక్రం సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన మాదా యానై కూట్టం.[9][10]
2012 లో దర్శకుడు మురుగదాస్ ఇతన్ని చూసి తన సినిమాలో నటించమని అడిగాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. తరువాత ప్రకాష్ మూడు సినిమాల్లో నటించడానికి అంగీకరించాడు. ఆడుకాలం నరేన్ దగ్గర నటనలో శిక్షణ పొందాడు.[11] తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రమ్ సినిమాకు రీమేక్ అయిన డార్లింగ్ సినిమాలో నటించాడు.
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2008 | కుసేలన్ | అతనే | "సినిమా సినిమా" పాటలో అతిధి పాత్ర |
2013 | నాన్ రాజవగా పొగిరెన్ | "కాలేజ్ పాదం" పాటలో అతిధి పాత్ర | |
తలైవా | నర్తకి | "వంగన్న" పాటలో అతిధి పాత్ర | |
2015 | డార్లింగ్ | కతీర్ | |
JK ఎనుమ్ నన్బనిన్ వాఙ్కై | అతనే | "టైటిల్" పాటలో అతిధి పాత్ర | |
త్రిష ఇల్లానా నయనతార | జీవా | ||
2016 | పెన్సిల్ | శివుడు | |
ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు | జానీ | ||
కడవుల్ ఇరుకన్ కుమారు | కుమార్ | ||
2017 | బ్రూస్ లీ | బ్రూస్ లీ (జెమినీ గణేశన్) | |
అన్బానవన్ అసరాధావన్ అడంగాధవన్ | జీవా | అతిధి పాత్ర | |
2018 | నాచియార్ | కాఠవరాయన్ | |
సెమ్మ | కులందైవేలు | ||
2019 | సర్వం తాళ మయం | పీటర్ జాన్సన్ | |
కుప్పతు రాజా | రాకెట్ | ||
వాచ్ మాన్ | బాల | ||
శివప్పు మంజల్ పచ్చై | మధన్ | తెలుగులో ఒరేయ్ బామ్మర్థి | |
100% కాదల్ | బాలు | ||
2021 | వణక్కం దా మాప్పిలే | అరవింద్ | |
బ్యాచిలర్ | డార్లింగ్ | ||
జైల్ | కరుణా | ||
2022 | సెల్ఫీ | కనల్ | |
అయ్యంగారన్ | మతి | ||
2023 | ఆదియే | జీవా | |
2024 | రెబెల్ | కతిరేసన్ | |
కాల్వన్ | కెంబరాజు | ||
డియర్ | అర్జున్ | ||
ఇడిముజక్కం † | TBA | చిత్రీకరణ | |
13 † | TBA | ప్రీ-ప్రొడక్షన్ | |
కింగ్‌స్టన్ † | TBA | ప్రీ-ప్రొడక్షన్ |
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)