జి.ఆర్. ఇందుగోపన్ | |
---|---|
జననం | వలతుంగల్, కొల్లం జిల్లా, కేరళ | 1974 ఏప్రిల్ 19
వృత్తి | సాహిత్యకారుడు, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత |
ప్రసిద్ధ పురస్కారాలు | అబుదాబి శక్తి అవార్డు కుంకుమం అవార్డు ఆషాన్ ప్రైజ్ |
జి.ఆర్. ఇందుగోపన్ కేరళకు చెందిన సాహిత్యకారుడు, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.[1] మలయాళ ఆధునిక రచయితలలో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు.[2] 2007 మలయాళ సినిమా ఒట్టక్కయ్యన్‌కి దర్శకత్వం వహించాడు. నవలలు, చిన్న కథా సంకలనాలు, జ్ఞాపకాలు, యాత్రా కథనాలను కలిగి ఉన్న అనేక పుస్తకాలను ప్రచురించాడు.[3] అబుదాబి శక్తి అవార్డు (2017, కొల్లప్పట్టి దయ కథకు),[4] కుంకుమం అవార్డు, ఆషాన్ ప్రైజ్ వంటి అనేక అవార్డులను అందుకున్నాడు.[5]
ఇందుగోపన్ 1974, ఏప్రిల్ 19న కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లాలోని వలతుంగల్‌లో జన్మించాడు.[6]
లాల్జీ దర్శకత్వం శ్రీనివాసన్ నటించిన చిత్తరియావర్ అనే మలయాళ సినిమాకు ఇందుగోపన్ స్క్రిప్ట్ రాశాడు.[7][8] 2007లో వచ్చిన ఒట్టక్కయ్యన్ సినిమాతో దర్శకుడిగా మారాడు.
సినిమా | సహకారం | సంవత్సరం |
---|---|---|
చిత్తారియవర్ | స్క్రీన్ ప్లే | 2004 |
ఒట్టక్కయ్యన్ | స్క్రీన్‌ప్లే, దర్శకత్వం | 2007 |
కాళీ గంధకీ | కథ | 2017 |
వూల్ఫ్ | స్క్రీన్ ప్లే | 2021 |
కాపా | స్క్రీన్ ప్లే | 2021 |
ఓరు తెక్కన్ తాళ్లు కేసు | కథ | 2022 |
క్రిస్టీ | స్క్రీన్ ప్లే | 2023 |
విలయత్ బుద్ధా | స్క్రీన్ ప్లే | 2023 |