వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జితేష్ మోహన్ శర్మ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | అమరావతి, మహారాష్ట్ర, భారతదేశం | 22 అక్టోబరు 1993|||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 10 అం. (178 cమీ.) | |||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్-బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 109) | 2023 3 అక్టోబరు - నేపాల్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 1 డిసెంబరు - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 6 | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2013/14–ప్రస్తుతం | విదర్భ | |||||||||||||||||||||||||||||||||||
2016–2017 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||
2022–ప్రస్తుతం | పంజాబ్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 అక్టోబరు 6 |
జితేష్ మోహన్ శర్మ (జననం 1993 అక్టోబరు 22) భారత జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. ఆయన 2022 ఆసియా క్రీడల సందర్భంగా 2023 అక్టోబరు 3న నేపాల్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆయన దేశీయ క్రికెట్‌లో విదర్భ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడతాడు.[1]
ఆయన 2013-14 విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున 2014 ఫిబ్రవరి 27న తన లిస్ట్ A అరంగేట్రం చేశాడు.[2] ఆయన 2015 అక్టోబరు 1న 2015–16 రంజీ ట్రోఫీలో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[3] ఆయన 2018-19 విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు, ఏడు మ్యాచ్‌లలో 298 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో జితేష్ శర్మ అంతర్జాతీయ అవకాశాలు మెరుగుపడ్డాయి.[4]
ఆయన పి. సేన్ ట్రోఫీలో కూడా భవానీపూర్ క్లబ్‌తో పాల్గొన్నాడు.[5][6]
ఆయన జనవరి 2023లో శ్రీలంకతో జరిగిన T20I సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టుకు తన తొలి కాల్-అప్ పొందాడు. ఆయన 2022 ఆసియా క్రీడల సందర్భంగా 2023 అక్టోబరు 3న నేపాల్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2023లో ఆస్ట్రేలియా T20I సిరీస్‌కు ఎంపికైయ్యాడు. ఆయన 2024 T20 ప్రపంచ కప్ కోసం పోటీలోనూ ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో ఆయన 19 బంతుల్లో 35 పరుగులు చేశాడు.[7] ఐదో టీ20లో 16 బంతుల్లో 24 పరుగులు చేశాడు.[8]
ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ షలక ముకేశ్వర్‌ను 2024 ఆగస్టు 9న వివాహం చేసుకున్నాడు.