జిల్ | |
---|---|
దర్శకత్వం | రాధాకృష్ణ |
రచన | రాధాకృష్ణ (Screenplay) |
కథ | రాధాకృష్ణ |
నిర్మాత | వంశీకృష్ణా రెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి |
తారాగణం | తొట్టెంపూడి గోపీచంద్ రాశి ఖన్నా |
ఛాయాగ్రహణం | శక్తి శరవణన్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | మొహమ్మద్ జిబ్రాన్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | లొర్గాన్ ఎంటర్‌టైర్మెంట్ (Australia & New Zealand)[2] |
విడుదల తేదీ | 27 మార్చి 2015[1] |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
జిల్ 2015 మార్చి 27న విడుదలైన తెలుగు సినిమా[1].
జై (గోపీచంద్) ఒక అగ్నిమాపకదళ అధికారి . ఒక ప్రమాదం నుంచి తనే కాపాడిన సావిత్రిపై (రాశి ఖన్నా) మనసు పారేసుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమకథ ఓ పక్క నడుస్తుండగా... ఒక రోజు ఓ అపరిచితుడికి (బ్రహ్మాజీ) సాయపడతాడు. అతని కోసం చోటా నాయక్ (కబీర్) అనే పచ్చి నెత్తురు తాగే నేరగాడు ఒకడు వెతుకుతుంటాడు. సదరు వ్యక్తి తన నుంచి వెయ్యి కోట్లు గోల్‌మాల్ చేయడమే కాకుండా తనని పోలీసులకి కూడా పట్టించాడని ఎలాగైనా అతడిని పట్టుకుని తన డబ్బు రాబట్టుకోవాలని నాయక్ ప్రయత్నిస్తుంటాడు. అయితే అతను ఓ ప్రమాదంలో చనిపోవడంతో... అతనికి సాయపడిన జైకి ఆ డబ్బులు ఎక్కడున్నాయో తెలుసుననుకుని ఇతడిని టార్గెట్ చేస్తాడు నాయక్. ఇద్దరి మధ్య సాగే దోబూచులాటతో కథనం సాగుతుంది[3]