జిల్లా | |
---|---|
దర్శకత్వం | ఆర్.టి.నేసన్ |
నిర్మాత | తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | గణేష్ రాజవేలు |
కూర్పు | డాన్ మ్యాక్స్ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థలు | సూపర్ గుడ్ ఫిలింస్, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 24 జూలై 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జిల్లా 2015లో తెలుగులో విడుదలైన సినిమా. సూపర్ గుడ్ ఫిలింస్, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ల పై తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితి నిర్మించిన ఈ సినిమాకు ఆర్.టి.నేసన్ దర్శకత్వం వహించాడు.[1] విజయ్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 జులై 2015న విడుదలైంది.[2]
శివుడు (మోహన్ లాల్) కుటుంబాన్న రక్షించే సమయంలో పోలీస్ ఆఫీసర్ చేతిలో శక్తి (విజయ్) తండ్రి చనిపోతాడు. ఆనాధల వున్న శక్తిని శివుడే తన సొంత కొడుకులా పెంచి పెద్ద చేస్తాడు. శివుడు శాంతి (కాజల్ అగర్వాల్)ను చూసిప్రేమలో పడతాడు. ఒకరోజు శివుడిని ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు కానీ క్షణాల్లోనే శక్తి మళ్లీ ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఎవరో బయటివాడు పోలీస్ అవడం వల్ల తమను అరెస్టు చేసే అవకాశం వుందని, అందుకే తమలోనే ఎవరో ఒకరు పోలీస్ అయితే ఎలాంటి సమస్య వుండదని శక్తిని పోలీస్ ఆఫీసర్ ను చేయాలని శివుడు నిర్ణయించుకుంటాడు. చివరకు శక్తి పోలీస్ ఆఫీసర్ అయ్యాడా?? శక్తిలో వచ్చిన మార్పు వల్ల ఏం జరిగింది ? ఆ సంఘటనకు కారణమైన వారిని శక్తి ఎలా ఢీకొన్నాడు? అనేదే మిగతా సినిమా కథ.[3]