జీతూ జోసఫ్ | |
---|---|
![]() | |
జననం | ఎర్నాకులం | నవంబరు 10, 1972
జాతీయత | భారతీయుడు |
వృత్తి | దర్శకుడు, రచయిత |
జీవిత భాగస్వామి | లింటా జీతు[1] |
జీతూ జోసఫ్, మలయాళ సినిమా దర్శకుడు, రచయిత, [2]డిటెక్టివ్ ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2010వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన మమ్మీ అండ్ మీ చిత్రం మలయాళ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అలాగే 2012వ సంవత్సరంలో విడుదలైన మై బాస్ చిత్రం కూడా ప్రేక్షకులను బాగా అలరించింది.
మోహన్ లాల్ హీరోగా జీతూ దర్శకత్వంలో తెరకెక్కిన 'దృశ్యం'[3] చిత్రం అతనికి మంచి పాపులారిటీని తీసుకొచ్చి పెట్టింది. ఇదే చిత్రం తమిళ వెర్షనులో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించగా, ఆ సినిమాకి కూడా జీతూయే దర్శకత్వం వహించాడు . 'దృశ్యం' చిత్రం మలయాళంలో కొత్త రికార్డులను తిరగరాసి.. దాదాపు 50 కోట్ల రూపాయల వరకూ వసూళ్లు సాధించింది.
దర్శకుడు జయరాజ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన జీతూ.. తర్వాత అవకాశాలు దక్కించుకోవడానికి చాలా కష్టపడ్డాడు.అతని తొలి సినిమాకి జీతూ తల్లే నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. నిర్మలా కాలేజీలో చదువుకున్న జీతూకి ఒక భార్య, ఇద్దరు పిల్లలు.
జీతు మువట్టుపుజా తాలూకాలోని ముథోలపురంలో సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో లీలమ్మ, వి. జోసెఫ్, మువట్టుపుజా మాజీ ఎమ్మెల్యే దంపతులకు జన్మించాడు. జీతూ తన తండ్రి ఇంజనీర్ కావాలనుకున్నప్పటికీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) లో చేరాలని అనుకున్నాడు. అతను ఫాతిమా మాతా ఇంగ్లీషు మీడియం పాఠశాలలో చదివాడు , తరువాత మువట్టుపుజాలోని నిర్మలా కళాశాల నుండి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. [4]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)