జీనాభాయ్ దేశాయ్ | |
---|---|
![]() | |
Born | జహింభాయ్ రతన్జీ దేశాయ్ 1903 ఏప్రిల్ 16 చిఖలి, గుజరాత్ |
Died | 6 జనవరి 1991 | (aged 87)
Pen name | స్నేహరష్మి |
Language | గుజరాతీ భాష |
Nationality | భారతీయుడు |
Citizenship | భారతదేశం |
జీనాభాయ్ రతన్జీ దేశాయ్ (16 ఏప్రిల్ 1903 - 6 జనవరి 1991), గుజరాత్ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గుజరాతీ రచయిత.
జీనాభాయ్ 1903, ఏప్రిల్ 16న గుజరాత్ రాష్ట్రంలోని చిఖలిలో జన్మించాడు. మెట్రిక్యులేషన్ చదువును వదిలిపెట్టి, 1920లో సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాడు. 1921లో గుజరాత్ విద్యాపీఠంలో చేరి, 1926లో రాజనీతి శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు.
1926 నుండి 1928 వరకు గుజరాత్ విద్యాపీఠంలో చరిత్ర, రాజనీతి శాస్త్రాన్ని బోధించాడు. 1934లో రాష్ట్రీయ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా చేరాడు. 1938లో శేత్ చిమన్లాల్ నాగిందాస్ విద్యాలయంలో ప్రిన్సిపాల్‌గా చేరాడు, డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు.[1] గుజరాత్ యూనివర్సిటీకి మూడుసార్లు యాక్టింగ్ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశాడు. 1972లో మద్రాసులో గుజరాతీ సాహిత్య పరిషత్‌కు ఆయన అధ్యక్షత వహించాడు.[2] గుజరాత్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో సెనేట్, సిండికేట్ సభ్యుడిగా కూడా పనిచేశాడు. సాహిత్య అకాడమీ, హిస్టారికల్ రికార్డ్స్ కమీషన్ సభ్యుడిగా కూడా పనిచేశాడు.
భారత స్వాతంత్ర్య కార్యక్రమాలలో ఉద్యమంలో పాల్గొన్నందుకు 1932 నుండి 1933 వరకు జైలు శిక్షను అనుభవించాడు.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న అనుభవంతో రాసిన తొలి రచనలు జాతీయవాద భావాలు, గాంధేయ ఆదర్శాల ద్వారా ప్రభావితమయ్యాయి.[3][4] తరువాత రచనలు అందం, భావోద్వేగాలపై ఎక్కువగా వచ్చాయి. ప్రధానంగా కవిత్వం, చిన్న కథలు వ్రాసాడు.[2]