హిందువుల వేదాల ప్రకారం సృష్ఠి ఆరంభం హిరణ్యగర్బం (బంగారు గుడ్డు) నుండి, ఉష్ణశక్తి బిందువు నుండి ఆరంభం జరిగింది.హిరణ్యగర్భం సిద్దాంతం (oval shape or elliptical shape of Universe) ను పోలి ఉంటుంది.ఉష్ణశక్తి సిద్దాంతం నేడు ఆమోదించిన మహా విస్ఫోట సిద్ధాంతం (Big Bang Theory) ని పోలివుంటుంది. మహా విస్ఫోటం ప్రకారం, విశ్వం, మహా ద్రవ్యరాశి, ఉష్ణస్థాయి నుండి నేటి వరకు గల వ్యాప్తి చెందింది.
జీవ పరిణామం జరిగిందని హిందూ ధర్మం విశ్వసిస్తుంది. ఈ వాదాన్ని డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం బలపరుస్తుంది. పూర్ణావతారములు, డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం పోలి ఉంటాయి. మత గ్రంథాలలో సృష్టి గురించి చెప్పిన వివరణకు విరుద్ధంగా ఏదైనా శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు వెలువడినప్పుడు, కఠోర సృష్టివాదులు ఆ ఫలితాలను తిరస్కరించటం గానీ, [1] వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సిద్ధాంతాలను, [2], /లేదా వాటి నిర్వహణా పద్ధతులను తప్పుపట్టడం కానీ చేస్తుంటారు[3] ఈ కారణాల వల్ల, సృష్టివాద విజ్ఞానాన్ని, ఇంటెలిజెంట్ డిజైన్ సిద్ధాంతాన్ని ప్రధానస్రవంతిలోని శాస్త్రీయ సముదాయం మిథ్యా విజ్ఞానముగా ముద్రవేస్తున్నది.[4]
Big Bang (బిగ్ బ్యాంగ్) సిద్దాంతం ప్రకారము నక్షత్రములు, అనేక నక్షత్ర మండలాలు (గాలక్సీ) అండాకార (గుడ్డు ఆకారం) సృష్టిలో విస్తరించుట ఇది హిరణ్యగర్భాన్ని పోలి ఉండును.
సూర్య సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి 365.2435374 రోజులు. ఆధునిక సైన్సు పరిజ్ఞానం ప్రకారం సంవత్సరానికి 365.2421897 రోజులు. ఈ రెండు సిద్ధాంతాలకు మధ్య గల తేడా కేవలం 1 నిమిషం, 54.44128 సెకండ్లు మాత్రమే.[5]ఋగ్వేదం ( 10:129 ) లో గల నాసదీయ సూక్తం ప్రకారం సృష్ఠి ఒక ఉష్ణశక్తి బిందువు నుంచి ఉద్బవించంది. ఇది మహా విస్ఫోటన సిద్దాంతాన్ని (Big Bang Theory) పోలి ఉంటుంది. ప్రఖ్యాత ఖగోళ, అంతరిక్ష, భౌతిక శాస్త్రవేత్తలు కేవలం హిందూ మతం మాత్రమే అంతరిక్షం, ఖగోళం గణాంక లెక్కలు సరిసమంగా కట్టిందని అభిప్రాయం వ్యక్తము చేసారు. వారిలో ప్రముఖ శాస్త్రవేత్తలైన కార్ల్ సాగన్, [6] నీల్స్ బోర్, ఎర్విన్ స్కోడింగర్, వెర్నర్ హైసన్బర్గ్ [7][8][9]రాబర్ట్ ఓపెన్ హీమర్[10] యూజీన్ విజ్ఞర్ [11] జార్జి సుదర్శన్ [12] ఫ్రిట్జాఫ్ కాప్రా [13] వంటి వారున్నారు. హిందూ ధర్మం ప్రకారం, హిందువుల శాస్త్రం ప్రకారం సృష్ఠి ఆరంభం హిరణ్యగర్బం (బంగారు గుడ్డు) నుండి జరిగింది.[14] ఈ సిద్దాంతం నేడు ఆమోదించిన మహా విస్ఫోటన సిద్దాంతంలో చెప్పబడిన (oval shape or eliptical shape of Universe) ను పోలి ఉంటుంది. అలా సృష్టి పుట్టిన తర్వాత త్రిమూర్తులు జన్మించారని ఇతిహాసం. 2007 వ సంవత్సరంలో అమెరికాలోప్యూ ఫోరమ్ చేసిన ఒక సర్వేలో 80% హిందువులు, పరిణామ వాదాన్ని అంగీకరించారు.[15]